Posts

భక్తిశ్రద్ధలతో కేదారేశ్వర నోములు

Image
కలికిరి నేస్తం న్యూస్:వాల్మీకిపురం పట్టణంలోని ప్రాచీన శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీకమాసం శుక్రవారం ఏకాదశి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు సామూహిక కేదారేశ్వర నోములను నోచుకున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమై అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, బిల్వార్చన, అనంతరం నిత్య సేవలు జరిగాయి.ఇందులో భాగంగా విశేషాలంకరణలో ముస్తాబైన కేదారేశ్వర స్వామి వారిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆస్థాన మండపంలో అధిరోహింపజేశారు. కార్తీక శుక్రవారం ఏకాదశి సందర్భంగా వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో ఆలయం భక్తులతో పోటెత్తింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోపవరం శ్రీనివాస స్వామి ఏకాదశి రోజున కేదారేశ్వర వ్రతాన్ని నోచుకుంటే కలిగే శుభాలు వ్రత విశిష్టతను భక్తులకు వివరించారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కువైట్ శంకరాచారి,ఆనంద రెడ్డి ఉపసర్పంచ్ కేశవరెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు

నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్

Image
కలికిరి నేస్తం న్యూస్:నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సి టి స్వామి తెలిపారు.గురువారం కలకడ ఎస్ఐ సి టి స్వామికి  అందిన రహస్య సమాచారం మేరకు కలకడ టౌన్ చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పై ఇందిరమ్మ కాలనీ వద్ద గల టీ దుకాణం వద్ద తెల్లని ప్లాస్టిక్ కవర్ సంచిలో నిషేధిత మత్తు పధార్థాలు పెట్టుకుని అమ్ముతుండగా ఎస్ఐ తమ సిబ్బందితో వెల్లగా వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నిస్తున్న షేక్ తరిగొండ ఖాధర్ షరీఫ్ అనే వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి ప్రభుత్వం నిషేధించిన 60 ప్యాకెట్లు హాన్స్, టొబాకో మరియు 30 ప్యాకెట్లు విమల్ పాన్ మసాలా టొబాకో ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు కలకడ ఎస్సై తిప్పే స్వామి తెలిపారు. ఈ సంధర్భంగా ఎస్ఐ తిప్పే స్వామి మాట్లాడుతూ కలకడ మండలంలో ఎక్కడైనా ప్రభుత్వం నిషేధించిన టొబాకో ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

అథ్లెటిక్స్ లో ఆల్ రౌండర్ ప్రతిభ కనబరచిన ఆదర్శ పాఠశాల విద్యార్థి

Image
 కలికిరి నేస్తం న్యూస్:నియోజక వర్గ స్థాయిలో జరిగిన క్రీడల ఎంపికలో కలకడ ఆదర్శ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థి నంద కుమార్ అత్యంత ప్రతిభ కనబరచి మైదానంలో దిగిన ప్రతి ఈవెంట్ లోనూ మొదటి స్థానంలో నిలిచారు. ఖో ఖో,కబడ్డీ క్రీడల్లో జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ లో 400 మీటర్లు,షాట్ పుట్,డిస్కస్ త్రో,లాంగ్ జంప్ ఈవెంట్స్ నందు మొదటి స్థానంలో నిలిచి మొత్తం 6 ఈవెంట్స్ నందు త్వరలో జిల్లా స్థాయిలో జరిగే ఎంపికలో పాల్గొంటాడు. ఇతనితో పాటు మరో ఆరు మంది ఆదర్శ పాఠశాల విద్యార్థులు అల్మాస్ అహమద్, అమీనుల్ల, పవిత్ర, రెడ్డి వంశీ, అఫాన్, ఆసిఫ్ లు కూడా ఎంపికయ్యారు. క్రీడల్లో దూసుకుపోతున్న విద్యార్థులను వ్యాయామ అధ్యాపకులు కరుణాకర్ అభినందించి మరింత మందిని క్రీడాకారులు గా తీర్చి దిద్దుతానని తెలిపారు.విద్యార్థులను ప్రిన్సిపల్ మలంషా, పాఠశాల చైర్మన్ మస్తాన్ అహమద్, మండల విద్యాశాఖాధికారి మునీంద్ర నాయక్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు

ప్రమాదంలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తను పరామర్శించిన..టీడీపీ జాతీయనేత నల్లారి

Image
 కలికిరి నేస్తం న్యూస్:ప్రమాదంలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తను టీడీపీ జాతీయనేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.గత పదిరోజుల క్రితం ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయ పడ్డ తెలుగుదేశం పార్టీ రాజీవ్ నగర్ కాలనీకి చెందిన భూత్ కన్వీనర్ నక్కా మణి ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాజీవ్ నగర్ కాలనీ లో పరామర్శించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల్లో ప్రయాణాలు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కార్యకర్త మణికి అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటామని అధైర్య పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.పరామర్శించిన వారిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం బిసి కార్యదర్శి పురం రామ్మూర్తి, పీలేరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మహేంద్ర రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీకర, పట్టణ అధ్యక్షులు సురేష్ కుమార్ రెడ్డి,(కంచి సూరి),మాజీ మండల అధ్యక్షులు ఎన్ అమర నాద రెడ్డి,మండల తెలుగు యువత అధ్యక్షులు నల్లారి రియాజ్,కలికిరి మండల తెలుగు యువత అధ్యక్షులు అవినాష్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు షౌఖత్, మండల మైనార...

బెజవాడ అమ్మాయిని ఎలాన్ మస్క్ ఎందుకు టార్గెట్ చేశాడు ?

Image
కలికిరి నేస్తం న్యూస్:ఆంధ్రా ! అందులోనూ బెజవాడ. ఆమె హవా మామూలుగా లేదు. ట్విటర్ లో పొలిటికల్ యాడ్స్ ఆపడం మొదలు, డొనాల్డ్ ట్రంప్ లాంటోళ్ల అక్కౌంట్లు లేపడం వరకూ ఆమె బ్రాండ్ చాలా పాపులర్. ఎస్. ఆమె విజయ గద్దె. ట్విటర్ లీగల్ డిపార్టుమెంటు హెడ్. అభ్యంతరకర ట్వీట్లు తీసేసే గైడ్ లైన్స్ మొదలు… లీగల్, ప్రైవసీ లాంటి ప్రతీ ఇష్యూనీ ఆమె తనదైన స్టైల్‌లో డీల్ చేశారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల టైమ్ లో అయితే ఆమె ఇన్ ఫ్లూయెన్స్ గురించి ప్రపంచం చాలా మాట్లాడుకుంది. ట్రంప్ అక్కౌంట్ ఎగిరింది అప్పుడే ! ఎగిరెగిరి రెచ్చిపోయిన కంగన లాంటి వాళ్లెందరో విజయ ఎఫెక్ట్ తో కంగుతిన్నారు.ప్రతీ కథకీ ఓ మలుపు ఉన్నట్టే విజయ కథ కూడా ! మస్క్ టేకోవర్ మొదలు కాగానే గురిపెట్టి పడగొట్టిన వికెట్స్ లో విజయ ఒకరు. ఎందుకంటే ఆమె ట్విటర్ ని మోస్ట్ ఎఫెక్టివ్ అండ్ డిసిప్లిన్డ్ చేసేసింది మరి !. మామూలుగానే ట్విటర్ ఇన్ ఫ్లూయెన్సర్స్ అండ్ తెలివైన వాళ్లుండే ప్లాట్ ఫామ్ !.అందుకే కొద్దిమందే ఉన్నా కేక పొలిమేర వరకూ వినపడుతుంది. అందుకే మస్క్ కన్నేశాడు. కొనేశాడు. ఇక వాడేస్తాడు. ఆర్టిఫియల్ బ్రెయిన్స్ తయారు చేసి డబ్బున్న తెలివి తక్కువోళ్లతో బిజినెస్ చేయా...

జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సైకిల్ ర్యాలీ

Image
కలికిరి నేస్తం న్యూస్:ఈ నెల 31న రాష్ట్రీయ ఏక్తా ధీవస్ ను విజయవంతం చేయాలని కలికిరి సిఆర్పిఎఫ్ సిఐఎటి స్కూల్ -3 సిబ్బంది సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు,మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి,ఉక్కుమనిషి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురష్కరించుకుని ఈ నెల 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు కలికిరి సిఆర్పిఎఫ్ కమాండెంట్ రాజేష్ కూమార్ తెలిపారు.జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శనివారం కమాండెంట్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ సిబ్బంది క్యాంపస్ నుంచి కలికిరి పట్టణంలోని ఆర్టీసి బస్టాండు వరకు సైకిల్ ర్యాలీని చేపట్టారు.ఈ సంధర్భంగా రాష్ట్రీయ ఏక్తా దీవస్ గురించి కలికిరి పట్టణంలో ప్రజలకు మైక్ ద్వారా వివరించారు. అనంతరం ర్యాలీ వ్యవసాయ మార్కెట్ నుంచి నగరిపల్లి మీదుగా సిఆర్పిఎఫ్ క్యాంప్ వరకూ సాగింది.అదేవిధంగా ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కమాండెంట్ రాజేష్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రెండవ కమాండెంట్ కేసి నిర్మల్,  డిప్యూటీ కమాండెంట్లు, ఏకే సింగ్, సి.నిషా మోల్,ఎస్ పి నంధన్ వార్, ప్రమోద్ కుమార్ మీనా,అసిస్టెంట్ కమాండెంట్ కె.రవికుమార్ మరియు సిబ్బ...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్..ముగ్గురు అరెస్ట్

Image
కలికిరి నేస్తం న్యూస్:అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్ చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ సి.టి స్వామి తెలిపారు.బహుదా నది నుండి ఇసుకను కలకడకు అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన రహస్య సమాచారం మేరకు కలకడ ఎస్ఐ సి.టి స్వామి కలకడ పీలేరు జాతీయ రహదారిలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్లను ఆపి రికార్డులు పరిశీలించగా ఇసుక తరలించడానికి పర్మిషన్ లేకపోవడంతో ఇసుక అక్రమంగా తరలిస్తున్న కలికిరి మండలం మహాల్ కొత్తపల్లికి చెందిన షేక్ మస్తాన్ వల్లి,షేక్ చాంద్ బాషా, అదే మండలం అద్దవారిపల్లికి చెందిన నంగి మురళిలను అరెస్ట్ చేసి ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ సి.తిప్పేస్వామి తెలిపారు. ఈ సంధర్భంగా ఎస్ఐ సిటి స్వామి మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని అటువంటి వారి పైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ గోపాలకృష్ణ,రమేష్ తదితరులు పాల్గొన్నారు Publicvibe news link 

అన్నమయ్య జిల్లాకు బస్సు సౌకర్యం కల్పించండి..మండలమీట్ లో సభ దృష్టికి ప్రజాప్రతినిధులు

Image
కలికిరి నేస్తం న్యూస్:అన్నమయ్య జిల్లా రాయచోటికి బస్సు సౌకర్యం కల్పించాలని మండలమీట్ లో సభ దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకువచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ అరుణమ్మ గైర్హాజర్ కావడంతో వైస్ ఎంపీపీ వెంకటరమణ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.ఈ సంధర్భంగా సమావేశంలో ప్రజాప్రతినిధులు సర్పంచులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి వాల్మీకిపురం పట్టణం నుంచి ఇప్పటివరకు ప్రైవేటు బస్సులు గాని,ఆర్టీసీ బస్సు సౌకర్యాలు గాని లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మదనపల్లి నుంచి వయా వాల్మీకిపురం మీదుగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి తక్షణమే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. వైస్ ఎంపీపీ వెంకటరమణ మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.పలు గ్రామాల్లో డ్రైనేజీ సిసి రోడ్ల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని త్వరలోనే ఆయా సచివాలయాల పరిధిలో డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. వర్షాకాలం దృష్ట్యా విష జ్వరాలు ప్రబలకుండా పారిశుధ్యం పై ...

ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని వందశాతం తల్లిదండ్రులకు చేర్చాలి..ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి

Image
కలికిరి నేస్తం న్యూస్:ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని తల్లిదండ్రులకు అందించి భాధ్యతగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తెలిపారు.శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో వాల్మీపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయ పరిధిలోని గుర్రంకొండ, కలకడ, వాల్మీపురం, కలికిరి మండలాలలో ఇటీవల ఎంపికైన 12 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు ఎమ్మెల్యే నియామక పత్రాలను అందించారు.ఈ సంధర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నేడు నియామక పత్రాలను అందుకున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాధ్యతతో తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు. చిన్నపిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని వందశాతం పిల్లల తల్లిదండ్రులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మీరు బాధ్యతతో పని చేస్తే గర్భవతులు బాలింతలు, పిల్లలు మంచి ఆరోగ్యంతో ముందు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ భారతి, సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు

సంక్షేమ పథకాల ప్రధాత వైఎస్ జగన్..ఎంపీపీ శ్రీదేవి

Image
కలికిరి నేస్తం న్యూస్:సంక్షేమ పథకాల ప్రధాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎంపీపీ శ్రీదేవి పేర్కొన్నారు. శనివారం కలకడ మండలం బాటవారి పల్లి పంచాయతీ లోని చలమయ్య గారి పల్లిలో సచీవాలయ అధికారులతో కలిసి పర్యటించారు.ఈ సంధర్భంగా ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వీధి లైట్లు పని చేయలేదని,జగనన్న ఇంటి నిర్మాణ బిల్లులు పడలేదని, సీసీ రోడ్డు అవసరమని, గ్రామస్తులు ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు.కొన్ని సమష్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని సమష్యలను ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి దృష్టికి తీసుకెల్లి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు.ఈ సంధర్భంగా ఎంపీపీ శ్రీదేవి మాట్లాడుతూ మండలంలో సమష్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మండలంలోని అన్ని సచీవాలయాలను సంధర్శిస్తానని తెలిపారు.ఆయా సచీవాలయాలను సంధర్శించే ముందు వాలంటీర్ల ద్వారా గ్రామస్తులకు ముందస్తుగా సమాచారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

తీసుకున్న అప్పు శాపంగా మారి యువకుడు మృతి

Image
కలికిరి నేస్తం న్యూస్:తీసుకున్న అప్పు తీర్చలేదని స్నేహితుల మధ్య ఘర్షణ జరగడంతో ఒకరు మృతి చెందగా అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు ఆదేశాల మేరకు రాయచోటి డీఎస్పీ పి.శ్రీధర్ ఆధ్వర్యంలో కారణమైన మరో స్నేహితుడైన నిందితున్ని గురువారం వాల్మీకిపురం సీఐ బీఎన్ సురేష్ అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.వాల్మీకిపురం మండలం దిగువ బూడిద వేడుకు చెందిన 37సంవత్సరాల వెంకటేశ్వర ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉంటూ 2011లో సబ్ జైలులో ఉన్నాడు. ఇదే సమయంలో కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన 38సంవత్సరాల ముబారక్ భార్య ఆత్మహత్య కేసులో ముద్దాయిగా మదనపల్లి సబ్ జైలుకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో సబ్ జైలులో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇదిలా ఉండగా కలికిరి మండలం, గుండ్లూరు కు చెందిన ముబారక్ కనబడలేదని ఈనెల 10వ తేదీన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కలికిరిలో కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో సీఐ బిఎన్ సురేష్ కేసును దర్యాప్తు చేపట్టారు. ముబారక్ హత్య కేసులో వెంకటేశ్వర నిందితుడుగా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.సీఐ బీఎన్ సురేష్ తెలిపిన వివరాల మేరకు గతంలో ముబారక్ కొంత నగదు అవసరమై స్నేహితుడైన వెంకటేశ్వర దగ్గర 13వేల రూపాయలు అప్పుగా తీసుకు...

ప్రజా సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయం..ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

Image
కలికిరి నేస్తం న్యూస్:ప్రజా సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వాల్మీకిపురం పట్టణంలోని బండ మకాను వీధి, కొత్తపేట వీధులలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే   ఇంటింటికి వెల్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు.సమష్యలను అడిగి తెలుసుకుని అక్కడక్కడే పరిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తోందని అన్నారు.గత టీడీపీ పాలనలో సంక్షేమ పథకాల మంజూరు కోసం జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సి వచ్చేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి మధ్యవర్తుల జోక్యం లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకే చేరుతున్నాయని అన్నారు. గడప గడపకు వచ్చిన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని లబ్ధిదారులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చింతల శివానందరెడ్డి, సర్పంచ్ గంగులమ్మ, ఉపసర్పంచ్ కేశవరెడ్డి, ఆర్ బి కే చైర్మన్ నీళ్ల భాస్కర్,మార్కెట్ కమిటీ చైర్మన్ రవి నాయక్, నియోజకవర్గ మైనారిటీ నాయకుడు అబ్ద...

నాడు నేడు పనులతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

Image
కలికిరి నేస్తం న్యూస్ :నాడు నేడు పథకంతో నేడు ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధిలోకి వచ్చాయని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం కేవిపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు ప్రారంభోత్సవాలకు శంఖుస్థాపన చేశారు. వగళ్ల గ్రామం నందు వైఎస్ ఆర్ డిజిటల్ గ్రంథాలయం నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు.అదేవిధంగా నారమాకులపల్లి ఒడ్డిపల్లి ఎంపిపి పాఠశాల నందు నాడు-నేడు పథకం కింద మంజూరు అయిన అదనపు గదుల నిర్మాణం, జడ్పీ ఉన్నత పాఠశాల నందు నాడు-నేడు పథకం కింద మంజూరైన అదనపు గదుల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. వై.యస్.ఆర్.చేయూత పథకం క్రింద 2244మంది సభ్యులకు 4.21కోట్ల రూపాయల మూడవ విడత చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా అర్హులైన వారికి ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గజ్జల శృతి శీను రెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ, మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పిటిసి జయ రామచంద్రయ్య,ద్వారకనాధ రెడ్డి, కార్పొరేషన్ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు Publicvibe news link 

సమాజానికి స్ఫూర్తిగా ఉపాధ్యాయ వృత్తి..డీఈఓ రాఘవ రెడ్డి

Image
కలికిరి నేస్తం న్యూస్:సమాజానికి ఉపాధ్యాయ వృత్తి దిశా నిర్దేశం తోపాటు స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నమయ్య జిల్లా డిఇఓ రాఘవ రెడ్డి పెర్కొన్నారు. బుధవారం కలకడ మండలం నడించెర్ల  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత  ఐ.పుష్పావతి  సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని డిఇఓ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు మెడిసిన్ ఇంజినీరింగ్ అంటున్నారని నేటి విద్యార్థినీ విద్యార్థులు కనీసం 10 శాతం మంది అయినా ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే ఆశయంతో చదవాలని కోరారు. అనంతరం అవార్డు గ్రహీత  పుష్పావతికి ఆమె భర్త నారాయణ స్వామికి శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి డివైఈఓ కృష్ణప్ప, ప్రధానోపాధ్యాయులు శంకరయ్య,ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, పార్వతమ్మ, పి ఆర్ టి యు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీనివాసరాజు,ఎంఇఓ మునీంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.

అతి పురాతన ఆలయాలకు నష్టం కలగనివ్వం..జేసీ హామీ

Image
కలికిరి నేస్తం న్యూస్: జాతీయ రహదారి నిర్మాణంలో అతి పురాతన ఆలయాలకు నష్టం కలగనివ్వమని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు.బుధవారం వాల్మీపురం పట్టణ సమీపంలోని బహుదా నది ఒడ్డున వెలసిన అతి పురాతనమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం మీదుగా మదనపల్లి తిరుపతి నాలుగు వరుసల రహదారి వెళ్తుండడంతో ఆ స్థలాన్ని జేసీ తమీమ్ అన్సారియా పరిశీలించారు. ఆలయానికి నష్టం కలగకుండా చూడాలని ప్రజల నుంచి వినతులు రావడంతో ఆమె బుధవారం పర్యటించి పరిశీలించారు.ఈ సంధర్భంగా ఆలయానికి నష్టం కలగకుండా ఆలయం పక్కనే రోడ్డు అలైన్మెంట్లు వెళ్లే విధంగా చూడాలని ఆమె రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె రోడ్డు నిర్వాసితులతో మాట్లాడుతూ రోడ్డు కోసం భూములు కోల్పోయే రైతులకు సంతృప్తికరమైన నష్టపరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కుటుంబ సమస్యలతో కోర్టులకు వెళ్లిన రోడ్డు నిర్వాసితుల భూ యాజమాన్యంతో చర్చించి వారిలో సానుకూల వాతావరణాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఫిరోజ్ ఖాన్,ఆర్ఐ బాబ్జి,సర్వేయర్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు