ప్రమాదంలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తను పరామర్శించిన..టీడీపీ జాతీయనేత నల్లారి
కలికిరి నేస్తం న్యూస్:ప్రమాదంలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తను టీడీపీ జాతీయనేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం పరామర్శించారు.గత పదిరోజుల క్రితం ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయ పడ్డ తెలుగుదేశం పార్టీ రాజీవ్ నగర్ కాలనీకి చెందిన భూత్ కన్వీనర్ నక్కా మణి ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి రాజీవ్ నగర్ కాలనీ లో పరామర్శించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల్లో ప్రయాణాలు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.కార్యకర్త మణికి అన్ని విధాల అండగా ఉండి ఆదుకుంటామని అధైర్య పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.పరామర్శించిన వారిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం బిసి కార్యదర్శి పురం రామ్మూర్తి, పీలేరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మహేంద్ర రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీకర, పట్టణ అధ్యక్షులు సురేష్ కుమార్ రెడ్డి,(కంచి సూరి),మాజీ మండల అధ్యక్షులు ఎన్ అమర నాద రెడ్డి,మండల తెలుగు యువత అధ్యక్షులు నల్లారి రియాజ్,కలికిరి మండల తెలుగు యువత అధ్యక్షులు అవినాష్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు షౌఖత్, మండల మైనారిటీ నాయకులు, ఛాన్ భాష,టీడీపీ సీనియర్ నాయకులు జాఫర్, మురళీమోహన్, పురుషోత్తం రెడ్డి, షామియానా జయన్న, కాలనీ ఎర్ర సీను, సుబ్బయ్య,పట్టణ తెలుగు యువత నాయకులు రెడ్డి ముని,ఎస్టి సెల్ అధ్యక్షులు సురేష్ నాయక్, రమణ నాయక్,రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి, ఖాజా, ఇందిరమ్మ కాలనీ అబ్బవరం శ్రీనివాసులు,నల్లారి యువ సేన నాసిర్,(గుండు)రెడ్డి బాషా, బారేష,అంజి, ఆల్తాఫ్, షౌఖత్, ఆసీఫ్, రవి,జావీద్, సుహెల్, పండు, ఆసీఫ్, రాకేష్,తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment