నాడు నేడు పనులతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
కలికిరి నేస్తం న్యూస్ :నాడు నేడు పథకంతో నేడు ప్రైవేటు పాఠశాలల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధిలోకి వచ్చాయని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం కేవిపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పలు ప్రారంభోత్సవాలకు శంఖుస్థాపన చేశారు. వగళ్ల గ్రామం నందు వైఎస్ ఆర్ డిజిటల్ గ్రంథాలయం నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు.అదేవిధంగా నారమాకులపల్లి ఒడ్డిపల్లి ఎంపిపి పాఠశాల నందు నాడు-నేడు పథకం కింద మంజూరు అయిన అదనపు గదుల నిర్మాణం, జడ్పీ ఉన్నత పాఠశాల నందు నాడు-నేడు పథకం కింద మంజూరైన అదనపు గదుల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. వై.యస్.ఆర్.చేయూత పథకం క్రింద 2244మంది సభ్యులకు 4.21కోట్ల రూపాయల మూడవ విడత చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా అర్హులైన వారికి ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గజ్జల శృతి శీను రెడ్డి, ఎంపీపీ ఈశ్వరమ్మ, మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పిటిసి జయ రామచంద్రయ్య,ద్వారకనాధ రెడ్డి, కార్పొరేషన్ డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు





Comments
Post a Comment