సంక్షేమ పథకాల ప్రధాత వైఎస్ జగన్..ఎంపీపీ శ్రీదేవి
కలికిరి నేస్తం న్యూస్:సంక్షేమ పథకాల ప్రధాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎంపీపీ శ్రీదేవి పేర్కొన్నారు. శనివారం కలకడ మండలం బాటవారి పల్లి పంచాయతీ లోని చలమయ్య గారి పల్లిలో సచీవాలయ అధికారులతో కలిసి పర్యటించారు.ఈ సంధర్భంగా ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వీధి లైట్లు పని చేయలేదని,జగనన్న ఇంటి నిర్మాణ బిల్లులు పడలేదని, సీసీ రోడ్డు అవసరమని, గ్రామస్తులు ఎంపీపీ దృష్టికి తీసుకొచ్చారు.కొన్ని సమష్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని సమష్యలను ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి దృష్టికి తీసుకెల్లి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలిపారు.ఈ సంధర్భంగా ఎంపీపీ శ్రీదేవి మాట్లాడుతూ మండలంలో సమష్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మండలంలోని అన్ని సచీవాలయాలను సంధర్శిస్తానని తెలిపారు.ఆయా సచీవాలయాలను సంధర్శించే ముందు వాలంటీర్ల ద్వారా గ్రామస్తులకు ముందస్తుగా సమాచారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ,సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.



Comments
Post a Comment