తీసుకున్న అప్పు శాపంగా మారి యువకుడు మృతి

కలికిరి నేస్తం న్యూస్:తీసుకున్న అప్పు తీర్చలేదని స్నేహితుల మధ్య ఘర్షణ జరగడంతో ఒకరు మృతి చెందగా అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు ఆదేశాల మేరకు రాయచోటి డీఎస్పీ పి.శ్రీధర్ ఆధ్వర్యంలో కారణమైన మరో స్నేహితుడైన నిందితున్ని గురువారం వాల్మీకిపురం సీఐ బీఎన్ సురేష్ అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.వాల్మీకిపురం మండలం దిగువ బూడిద వేడుకు చెందిన 37సంవత్సరాల వెంకటేశ్వర ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉంటూ 2011లో సబ్ జైలులో ఉన్నాడు. ఇదే సమయంలో కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన 38సంవత్సరాల ముబారక్ భార్య ఆత్మహత్య కేసులో ముద్దాయిగా మదనపల్లి సబ్ జైలుకు వెళ్లాడు.ఈ నేపథ్యంలో సబ్ జైలులో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇదిలా ఉండగా కలికిరి మండలం, గుండ్లూరు కు చెందిన ముబారక్ కనబడలేదని ఈనెల 10వ తేదీన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కలికిరిలో కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో సీఐ బిఎన్ సురేష్ కేసును దర్యాప్తు చేపట్టారు. ముబారక్ హత్య కేసులో వెంకటేశ్వర నిందితుడుగా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.సీఐ బీఎన్ సురేష్ తెలిపిన వివరాల మేరకు గతంలో ముబారక్ కొంత నగదు అవసరమై స్నేహితుడైన వెంకటేశ్వర దగ్గర 13వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల వెంకటేశ్వర స్వగ్రామంలో దేవర్లు జరగనున్నాయి. పండుగ ఖర్చులు నిమిత్తం నగదు లేకపోవడంతో తనకు రావలసిన డబ్బులను ఇవ్వాలని ముబారక్ ను పలుసార్లు ఫోన్ ద్వారా అడిగిన ఇవ్వలేదు. దీంతో ఈ నెల 5న వాల్మీకిపురంలో కొయ్యపని ముగించుకుని ముబారక్ రాత్రి 8 గంటల సమయంలో తన హీరో హోండా వాహనంపై గుండ్లూరుకు బయలుదేరాడు. ఇదే సమయంలో మార్గమధ్యంలోని ముడియం వారి పల్లి సమీపంలో వెంకటేశ్వర ఎదురుపడి అప్పు విషయమై ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగి బలమైన తోపులాటలో పక్కనే ఉన్న కాలువలోని బండరాయిపై ముబారక్ వెల్లకిలా పడిపోయాడు.దీంతో ముబారక్ తలకు బలమైన రక్తగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర భయానికి లోనై ముబారక్ మోటార్ సైకిల్, సెల్ ఫోన్ మరియు చెప్పులను షికారి పాలెం దగ్గరే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో గల తుంటి బండ దగ్గర్లో పడేశాడు. అక్కడే కొంత దూరంలో ముళ్లపొదల్లో ముబారక్ మృతదేహాన్ని పడేశాడు.కాల్ డేటా ఆధారంగా దర్యాప్తుని చేపట్టిన పోలీసులు నిందితుడు స్నేహితుడైన వెంకటేశ్వర అని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ బిఎన్ సురేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సై బిందు మాధవి మరియు కలికిరి ఏఎస్ఐ మధుసూధన ఆచారి తదితర పోలీసులు పాల్గొన్నారు


          మృతి చెందిన ముభారక్ ఫైల్ ఫోటో👆




Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం