నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్
కలికిరి నేస్తం న్యూస్:నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ సి టి స్వామి తెలిపారు.గురువారం కలకడ ఎస్ఐ సి టి స్వామికి అందిన రహస్య సమాచారం మేరకు కలకడ టౌన్ చిత్తూరు కర్నూలు జాతీయ రహదారి పై ఇందిరమ్మ కాలనీ వద్ద గల టీ దుకాణం వద్ద తెల్లని ప్లాస్టిక్ కవర్ సంచిలో నిషేధిత మత్తు పధార్థాలు పెట్టుకుని అమ్ముతుండగా ఎస్ఐ తమ సిబ్బందితో వెల్లగా వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నిస్తున్న షేక్ తరిగొండ ఖాధర్ షరీఫ్ అనే వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుంచి ప్రభుత్వం నిషేధించిన 60 ప్యాకెట్లు హాన్స్, టొబాకో మరియు 30 ప్యాకెట్లు విమల్ పాన్ మసాలా టొబాకో ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు కలకడ ఎస్సై తిప్పే స్వామి తెలిపారు. ఈ సంధర్భంగా ఎస్ఐ తిప్పే స్వామి మాట్లాడుతూ కలకడ మండలంలో ఎక్కడైనా ప్రభుత్వం నిషేధించిన టొబాకో ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు

Comments
Post a Comment