సమాజానికి స్ఫూర్తిగా ఉపాధ్యాయ వృత్తి..డీఈఓ రాఘవ రెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:సమాజానికి ఉపాధ్యాయ వృత్తి దిశా నిర్దేశం తోపాటు స్ఫూర్తిని కలిగిస్తుందని అన్నమయ్య జిల్లా డిఇఓ రాఘవ రెడ్డి పెర్కొన్నారు. బుధవారం కలకడ మండలం నడించెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఐ.పుష్పావతి సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని డిఇఓ మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులు మెడిసిన్ ఇంజినీరింగ్ అంటున్నారని నేటి విద్యార్థినీ విద్యార్థులు కనీసం 10 శాతం మంది అయినా ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే ఆశయంతో చదవాలని కోరారు. అనంతరం అవార్డు గ్రహీత పుష్పావతికి ఆమె భర్త నారాయణ స్వామికి శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి డివైఈఓ కృష్ణప్ప, ప్రధానోపాధ్యాయులు శంకరయ్య,ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, పార్వతమ్మ, పి ఆర్ టి యు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీనివాసరాజు,ఎంఇఓ మునీంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.





Comments
Post a Comment