అథ్లెటిక్స్ లో ఆల్ రౌండర్ ప్రతిభ కనబరచిన ఆదర్శ పాఠశాల విద్యార్థి
కలికిరి నేస్తం న్యూస్:నియోజక వర్గ స్థాయిలో జరిగిన క్రీడల ఎంపికలో కలకడ ఆదర్శ పాఠశాలలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థి నంద కుమార్ అత్యంత ప్రతిభ కనబరచి మైదానంలో దిగిన ప్రతి ఈవెంట్ లోనూ మొదటి స్థానంలో నిలిచారు. ఖో ఖో,కబడ్డీ క్రీడల్లో జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ లో 400 మీటర్లు,షాట్ పుట్,డిస్కస్ త్రో,లాంగ్ జంప్ ఈవెంట్స్ నందు మొదటి స్థానంలో నిలిచి మొత్తం 6 ఈవెంట్స్ నందు త్వరలో జిల్లా స్థాయిలో జరిగే ఎంపికలో పాల్గొంటాడు. ఇతనితో పాటు మరో ఆరు మంది ఆదర్శ పాఠశాల విద్యార్థులు అల్మాస్ అహమద్, అమీనుల్ల, పవిత్ర, రెడ్డి వంశీ, అఫాన్, ఆసిఫ్ లు కూడా ఎంపికయ్యారు. క్రీడల్లో దూసుకుపోతున్న విద్యార్థులను వ్యాయామ అధ్యాపకులు కరుణాకర్ అభినందించి మరింత మందిని క్రీడాకారులు గా తీర్చి దిద్దుతానని తెలిపారు.విద్యార్థులను ప్రిన్సిపల్ మలంషా, పాఠశాల చైర్మన్ మస్తాన్ అహమద్, మండల విద్యాశాఖాధికారి మునీంద్ర నాయక్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు

Comments
Post a Comment