అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్..ముగ్గురు అరెస్ట్
కలికిరి నేస్తం న్యూస్:అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్ చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ సి.టి స్వామి తెలిపారు.బహుదా నది నుండి ఇసుకను కలకడకు అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన రహస్య సమాచారం మేరకు కలకడ ఎస్ఐ సి.టి స్వామి కలకడ పీలేరు జాతీయ రహదారిలోని ఆంజనేయస్వామి గుడి దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్లను ఆపి రికార్డులు పరిశీలించగా ఇసుక తరలించడానికి పర్మిషన్ లేకపోవడంతో ఇసుక అక్రమంగా తరలిస్తున్న కలికిరి మండలం మహాల్ కొత్తపల్లికి చెందిన షేక్ మస్తాన్ వల్లి,షేక్ చాంద్ బాషా, అదే మండలం అద్దవారిపల్లికి చెందిన నంగి మురళిలను అరెస్ట్ చేసి ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్ఐ సి.తిప్పేస్వామి తెలిపారు. ఈ సంధర్భంగా ఎస్ఐ సిటి స్వామి మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని అటువంటి వారి పైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ గోపాలకృష్ణ,రమేష్ తదితరులు పాల్గొన్నారు



Comments
Post a Comment