ప్రజా సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయం..ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:ప్రజా సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వాల్మీకిపురం పట్టణంలోని బండ మకాను వీధి, కొత్తపేట వీధులలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటింటికి వెల్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు.సమష్యలను అడిగి తెలుసుకుని అక్కడక్కడే పరిష్కరించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తోందని అన్నారు.గత టీడీపీ పాలనలో సంక్షేమ పథకాల మంజూరు కోసం జన్మభూమి కమిటీలను ఆశ్రయించాల్సి వచ్చేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి మధ్యవర్తుల జోక్యం లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకే చేరుతున్నాయని అన్నారు. గడప గడపకు వచ్చిన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని లబ్ధిదారులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చింతల శివానందరెడ్డి, సర్పంచ్ గంగులమ్మ, ఉపసర్పంచ్ కేశవరెడ్డి, ఆర్ బి కే చైర్మన్ నీళ్ల భాస్కర్,మార్కెట్ కమిటీ చైర్మన్ రవి నాయక్, నియోజకవర్గ మైనారిటీ నాయకుడు అబ్దుల్ కలీమ్,రాష్ట్ర కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ నర్సింహులు, వైసీపీ నాయకులు చింతల వివేకానందరెడ్డి, శ్రీధర్ రాయల్ , రాజేష్, చికెన్ మస్తాన్ , కువైట్ ఇబ్రహీం , సైఫుల్లా, నారాయణ , రఘు, రమేష్ , ఎంపీడీవో షబ్బీర్ అహ్మద్, ఏఈలు కమలాకర్ రెడ్డి , జాకీర్ హుస్సేన్ , పంచాయతీ ఈవో ఉదయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, వాలంటీర్లు పాల్గొన్నారు.





Comments
Post a Comment