భక్తిశ్రద్ధలతో కేదారేశ్వర నోములు
కలికిరి నేస్తం న్యూస్:వాల్మీకిపురం పట్టణంలోని ప్రాచీన శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీకమాసం శుక్రవారం ఏకాదశి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు సామూహిక కేదారేశ్వర నోములను నోచుకున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమై అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, బిల్వార్చన, అనంతరం నిత్య సేవలు జరిగాయి.ఇందులో భాగంగా విశేషాలంకరణలో ముస్తాబైన కేదారేశ్వర స్వామి వారిని మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆస్థాన మండపంలో అధిరోహింపజేశారు. కార్తీక శుక్రవారం ఏకాదశి సందర్భంగా వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో ఆలయం భక్తులతో పోటెత్తింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోపవరం శ్రీనివాస స్వామి ఏకాదశి రోజున కేదారేశ్వర వ్రతాన్ని నోచుకుంటే కలిగే శుభాలు వ్రత విశిష్టతను భక్తులకు వివరించారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కువైట్ శంకరాచారి,ఆనంద రెడ్డి ఉపసర్పంచ్ కేశవరెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు








Comments
Post a Comment