అతి పురాతన ఆలయాలకు నష్టం కలగనివ్వం..జేసీ హామీ

కలికిరి నేస్తం న్యూస్: జాతీయ రహదారి నిర్మాణంలో అతి పురాతన ఆలయాలకు నష్టం కలగనివ్వమని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు.బుధవారం వాల్మీపురం పట్టణ సమీపంలోని బహుదా నది ఒడ్డున వెలసిన అతి పురాతనమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం మీదుగా మదనపల్లి తిరుపతి నాలుగు వరుసల రహదారి వెళ్తుండడంతో ఆ స్థలాన్ని జేసీ తమీమ్ అన్సారియా పరిశీలించారు. ఆలయానికి నష్టం కలగకుండా చూడాలని ప్రజల నుంచి వినతులు రావడంతో ఆమె బుధవారం పర్యటించి పరిశీలించారు.ఈ సంధర్భంగా ఆలయానికి నష్టం కలగకుండా ఆలయం పక్కనే రోడ్డు అలైన్మెంట్లు వెళ్లే విధంగా చూడాలని ఆమె రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె రోడ్డు నిర్వాసితులతో మాట్లాడుతూ రోడ్డు కోసం భూములు కోల్పోయే రైతులకు సంతృప్తికరమైన నష్టపరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కుటుంబ సమస్యలతో కోర్టులకు వెళ్లిన రోడ్డు నిర్వాసితుల భూ యాజమాన్యంతో చర్చించి వారిలో సానుకూల వాతావరణాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఫిరోజ్ ఖాన్,ఆర్ఐ బాబ్జి,సర్వేయర్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు





Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం