అన్నమయ్య జిల్లాకు బస్సు సౌకర్యం కల్పించండి..మండలమీట్ లో సభ దృష్టికి ప్రజాప్రతినిధులు
కలికిరి నేస్తం న్యూస్:అన్నమయ్య జిల్లా రాయచోటికి బస్సు సౌకర్యం కల్పించాలని మండలమీట్ లో సభ దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకువచ్చారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ అరుణమ్మ గైర్హాజర్ కావడంతో వైస్ ఎంపీపీ వెంకటరమణ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.ఈ సంధర్భంగా సమావేశంలో ప్రజాప్రతినిధులు సర్పంచులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి వాల్మీకిపురం పట్టణం నుంచి ఇప్పటివరకు ప్రైవేటు బస్సులు గాని,ఆర్టీసీ బస్సు సౌకర్యాలు గాని లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మదనపల్లి నుంచి వయా వాల్మీకిపురం మీదుగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటికి తక్షణమే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. వైస్ ఎంపీపీ వెంకటరమణ మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.పలు గ్రామాల్లో డ్రైనేజీ సిసి రోడ్ల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని త్వరలోనే ఆయా సచివాలయాల పరిధిలో డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. వర్షాకాలం దృష్ట్యా విష జ్వరాలు ప్రబలకుండా పారిశుధ్యం పై దృష్టి సారించాలని ఎంపీడీఓ షబ్బీర్ అహ్మద్ వైద్య సిబ్బందికి,సర్పంచులకు సూచించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఫిరోజ్ ఎంపీడీఓ షబ్బీర్ అహ్మద్, వైస్ ఎంపీపీ కిరణ్ కుమార్, సర్పంచులు గంగులమ్మ, ముని భాస్కర్, పులి చిట్టెమ్మ, భాస్కర్, రెడ్డి రాణి,ఎంపీటీసీలు రాజేష్, శ్రీనివాసులు, శ్రావణి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు



Comments
Post a Comment