జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సైకిల్ ర్యాలీ

కలికిరి నేస్తం న్యూస్:ఈ నెల 31న రాష్ట్రీయ ఏక్తా ధీవస్ ను విజయవంతం చేయాలని కలికిరి సిఆర్పిఎఫ్ సిఐఎటి స్కూల్ -3 సిబ్బంది సైకిల్ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు,మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి,ఉక్కుమనిషి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురష్కరించుకుని ఈ నెల 31న జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు కలికిరి సిఆర్పిఎఫ్ కమాండెంట్ రాజేష్ కూమార్ తెలిపారు.జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ శనివారం కమాండెంట్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ సిబ్బంది క్యాంపస్ నుంచి కలికిరి పట్టణంలోని ఆర్టీసి బస్టాండు వరకు సైకిల్ ర్యాలీని చేపట్టారు.ఈ సంధర్భంగా రాష్ట్రీయ ఏక్తా దీవస్ గురించి కలికిరి పట్టణంలో ప్రజలకు మైక్ ద్వారా వివరించారు. అనంతరం ర్యాలీ వ్యవసాయ మార్కెట్ నుంచి నగరిపల్లి మీదుగా సిఆర్పిఎఫ్ క్యాంప్ వరకూ సాగింది.అదేవిధంగా ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కమాండెంట్ రాజేష్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రెండవ కమాండెంట్ కేసి నిర్మల్,  డిప్యూటీ కమాండెంట్లు, ఏకే సింగ్, సి.నిషా మోల్,ఎస్ పి నంధన్ వార్, ప్రమోద్ కుమార్ మీనా,అసిస్టెంట్ కమాండెంట్ కె.రవికుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.







Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం