గుర్రంకొండలో నలుగురు ట్రాన్స్ ఫార్మర్ దొంగలు అరెస్ట్

కలికిరి నేస్తం న్యూస్:ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి వైరు చోరీలకు పాల్పడే నలుగురు దొంగలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు రాయచోటి డీఎస్పీ పి.శ్రీధర్ బుధవారం గుర్రంకొండ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.ఆయన తెలిపిన వివరాల మేరకు రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో గుర్రంకొండ కలకడ వాయల్పాడు కలికిరి పీలేరు పరిసర ప్రాంతాలలో  26 ట్రాన్స్ ఫార్మర్లు, మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పిటిఎం, మదనపల్లి తాలూకా తంబళ్లపల్లి, బి.కొత్తకోట,ముదివేడు పరిసర ప్రాంతాల్లో 18 ట్రాన్స్ ఫార్మర్లు, పలమనేరు సబ్ డివిజన్ పరిధిలో గంగవరం, పలమనేరు, పుంగనూరు, సోమల పరిసర ప్రాంతాల్లో 8 ట్రాన్స్ ఫార్మర్లు మొత్తం 52 ట్రాన్స్ ఫార్మర్లను గత కొన్ని నెలలు కాలంగా రాత్రిపూట గ్రామ శివారులలో గల రైతుల పంట పొలాల నందు ఎవరూ లేని సమయం చూసి ట్రాన్స్ ఫార్మర్లను రాత్రుళ్లో ధ్వంసం చేసి వైరు చోరీ చేసి బెంగుళూరులో అమ్మి వచ్చే డబ్బులతో జల్సాలకు పాల్పడే మదనపల్లి టౌన్ కు చెందిన గానుగుల హనుమంతు(42), బీరంగుల శ్రీరాములు(41), ఆళ్లకుంట గంగరాజు(26), సమితి మురళి(40) అను నలుగురు దొంగలను,అన్నమయ్య జిల్లాఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రాయచోటి డిఎస్పి మరియు కలకడ సీఐ సురేష్ రెడ్డి పర్యవేక్షణలో గుర్రంకొండ ఎస్సై దిలీప్ కుమార్ కు అందిన రహస్య సమాచారం మేరకు ఎస్సై దిలీప్ కుమార్ తన సిబ్బందితో వెళ్లి బుధవారం ఉదయం గుర్రంకొండ మండలం తరిగొండ గ్రామం రెడ్డివారిపల్లికి పోవు మార్గంలోని జంక్షన్ వద్ద దాడిచేసి పట్టుకుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే 340కిలోల రాగి వైరు,60కిలోల అల్యూమినియం వైరు కట్టలు, అదేవిధంగా రెండు లక్షలు విలువ చేసే ఆటోను సీజ్ చేసి చోరీలకు పాల్పడిన నలుగురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి పి.శ్రీధర్  తెలిపారు.వీరిలో ముగ్గురు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన కరెంట్ పోల్స్ మరియు ట్రాన్స్ ఫార్మర్లు బిగించు కూలీ పనులకు వెళ్తుంటారు.  సమితి మురళి గతంలో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ డిపార్ట్మెంట్ నందు కూలి పనులకు వెళ్తూ ఉండేవాడు. ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరు నలుగురు కలిసి చోరీలకు పాల్పడుతూ పట్టుబడ్డారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ దిలీప్ కుమార్ మరియు సిబ్బంది ఏఎస్ఐ నరసింహులు మరియు హెడ్ కానిస్టేబుల్ రమణ, వేణుగోపాల్ శివప్రసాద్, పిసిలు రామ్మూర్తి, సురేంద్ర, జనార్ధన, వేణుమాధవ్, అర్జున్, మనోహర, హోంగార్డులు చంద్రశేఖర్, రాఘవేంద్ర రెడ్డి,  మరియు వాల్మీపురం హెడ్ కానిస్టేబుల్ ఎం జగదీష్, రాఘవరెడ్డి, ఫామిన్ లు ముద్దాయిలను పట్టుకున్నందుకు సిబ్బంది ప్రతి ఒక్కరికి రివార్డుల కొరకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు డీఎస్పీ పీ.శ్రీధర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కలకడ సర్కిల్ సీఐ సురేష్ రెడ్డి, గుర్రంకొండ ఎస్సై దిలీప్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..

Kalikiri Nestham Tv..YouTube link 


Publicvibe news link 




Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం