ఘనంగా అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు

కలికిరి నేస్తం న్యూస్:అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలను అన్నమయ్య జిల్లా  పరిధిలోని దేవపట్ల గ్రామం లోని బలయోగి బాలికల గురుకుల పాఠశాలలో అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ పర్యవేక్షణ అధికారి (డి.పి.ఎమ్.ఓ).డాక్టర్ లోకవర్ధన్ మరియు జిల్లా ఆర్.బి.ఎస్.కే. ప్రోగ్రాం అధికారి డాక్టర్ శేషగిరి బాబు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన డి.పి.ఎమ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాలికల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు. అందులో ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బాలికల కొరకు స్వేచ్ఛ అనే కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించినట్లు అన్నారు. డాక్టర్ శేషగిరి బాబు  మాట్లాడుతూ రక్తహీనత నివారణకు ప్రతీ గురువారం మధ్యాహ్నం భోజనం అనంతరం ఐరన్ మాత్రలు పంపిణీ చేస్తున్నామని అన్నారు.హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ భేటి బచావో భేటి పడావో కార్యక్రమంలో బాలికల పాత్ర ముఖ్యమైనదని,గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పై అవగాహన కల్పించారు. ప్రిన్సిపల్ శ్రీకళ దేవి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆడపిల్లల పై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతి ఆడపిల్ల స్వయం రక్షణ కలిగి ఉండాలని అన్నారు.అనంతరం బాలికలచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ రాధ, ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బంది, ఉపాద్యాయులు పాల్గొన్నారు.









Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం