కేవికేలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళనం పై రైతులకు అవగాహన
కలికిరి నేస్తం న్యూస్:కేవికే కలికిరిలో సోమవారం పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళనం పై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సంధర్భంగా కేవికే ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎంకే జ్యోత్స్న మాట్లాడుతూ ప్రధానమంత్రి సమ్మాన్ సమ్మేళన్ యొక్క ప్రాముఖ్యతను గూర్చి వివరిస్తూ దేశంలో ఉన్న ఎరువుల దుకాణాలను దశలవారీగా వన్ స్టాప్ సెంట్రల్ గా మార్చి వాటిలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు,వ్యవసాయ పనిముట్లు, భూసార పరీక్ష సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల గురించి సమాచారాన్ని ఉంచుతారని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగించినట్లు తెలిపారు. ఒకే దేశం ఒకే ఎరువు ఇతివృత్తంలో భాగంగా భారత్ యూరియా, భారత్ డిఎపి, భారత్ ఎంటపి, భారత్ ఎన్పీకే పేరుతో విడుదల చేయడం వల్ల రవాణా ఖర్చులు తగ్గుతాయని అన్నారు. జిల్లాలో పండిస్తున్న వేరుశనగ, కంది, టమోటా, బొప్పాయి, మామిడిలో పురుగులు మరియు తెగుళ్లు గురించి శాస్త్రవేత్తలు డాక్టర్ ఆర్ లక్ష్మీ ప్రసన్న, ఏరువాక కేవికే కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వై.పీరు సాహెబ్ లు రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో కే.మాధురి, ఐ జ్యోతి, కే నవీన, ఏ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.




Comments
Post a Comment