అంబేద్కర్ కళలను నిజం చేసిన గొప్ప పోరాట యోధుడు కాన్షీరామ్..బాస్ నేత పాలకుంట

కలికిరి నేస్తం న్యూస్:అంబేద్కర్ కళలను నిజం చేసిన గొప్ప పోరాట యోధుడు కాన్షీరామ్ అని భారతీయ అంబేద్కర్ సేన జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు అన్నారు. ఆదివారం పీలేరు పట్టణంలో బాస్  కార్యాలయం లో కాన్షీరామ్ 16 వ వర్ధంతి ని పురస్కరించుకొని బాస్ నాయకులు ఆయన చిత్రపటానికి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ  సంధర్భంగా భారతీయ అంబేద్కర్ సేన జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ  అనేక సంవత్సరాలుగా మానవ హక్కుల కు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తి చేయడానికి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తన జీవితం చివరి వరకు కృషి చేస్తే అంబేద్కర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరణించేదాకా పోరాడిన గొప్ప యోధుడు,పీడిత జనులను పాలకులుగా చూడాలన్న అంబేద్కర్ కలలను నిజం చేసిన గొప్ప పోరాట యోధుడు కాన్షీరామ్  కొనియాడారు. అటువంటి పోరాట యోధున్ని స్ఫూర్తిగా తీసుకుని బహుజనులందరూ ఏకమై రాజకీయ అధికారం వైపు నడవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో నాయకులు ముల్లంగి  కృష్ణయ్య,తంగెళ్ల నాగేంద్ర,నెట్టిబండ రాము,సుబ్రహ్మణ్యం,కేశవ తదితరులు పాల్గొన్నారు
 



Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం