కలికిరి గ్రామ పంచాయతీలో ఘనంగా విజయదశమి వేడుకలు
కలికిరి నేస్తం న్యూస్:అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి గ్రామ పంచాయతీ నందు శుక్రవారం ఉదయం విజయదశమిని పురష్కరించుకొని ఆయుధ పూజ కార్యక్రమాన్ని సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం నందు కనక దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.సర్పంచ్ రెడ్డివారితో పాటు ఇంచార్జ్ ఈఓ టి.ఉదయ్ కుమార్ మరియు ఎంపిడిఓ సి.గంగయ్య లు అమ్మవారికి టెంకాయలు కొట్టి ప్రార్థించారు. పంచాయతీ కార్యాలయ ఆవరణంలో వాహనాలకు పూలదండలతో ప్రత్యేక అలంకరణ చేసీ ఆలయ పూజారి చేత వాహనాలకు ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయ సిబ్బంది,కార్మికులు తదితరులు పాల్గొన్నారు
పబ్లిక్ వైబ్ న్యూస్ లింక్👇





Comments
Post a Comment