ఏపిఎం ఎస్ఎస్ టియు అధ్యక్షులుగా చెన్నూరు బాలాజి ఎన్నిక
కలికిరి నేస్తం న్యూస్:అన్నమయ్య జిల్లా ఏపిఎం ఎస్ఎస్ టియు అధ్యక్షులుగా చెన్నూరు బాలాజి ఎన్నికయ్యారు.ఆదివారం నాడు అన్నమయ్య జిల్లా ఏపిఎం ఎస్ఎస్ టియు నూతన కార్యవర్గం రాయచోటి నందు జరిగింది.ఈ ఎన్నిక రాష్ట్ర అధ్యక్షులు పి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగగా జిల్లా లోని 17 ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపల్స్,పిజిటి, టిజిటీలు రాయచోటి నందు సమావేశమై ఏపిఎం ఎస్ఎస్ టియు తరపున నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం కేవిపల్లి ఆదర్శ పాఠశాలలో పిజిటిగా పనిచేస్తున్న చెన్నూరు బాలాజీని జిల్లా అధ్యక్షులుగా, పీటిఎం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శివకుమారిని మహిళా అధ్యక్షురాలుగా, పుల్లంపేట ఆదర్శ పాఠశాలలో పిజిటిగా పనిచేస్తున్న డాక్టర్ ఐ మోహన్ మురళిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు బాలాజీ తెలిపారు.ఈ కార్యక్రమానికి పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హాజరయ్యారు.ఎన్నికల పరిశీలకులు గాఅన్నమయ్య జిల్లా ఎస్ టియు అధ్యక్షులు జి.జగన్ మోహన్ రెడ్డి ,ఎస్ టియు రాష్ట్ర కార్యదర్శి, శివారెడ్డి వ్యవహరించినట్లు తెలిపారు.
జిల్లా అధ్యక్షులుగా👆చెన్నూరు బాలాజి




Good coverge
ReplyDelete