పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం పదిలం..ప్రిన్సిపల్ ఎస్ వి సత్యనారాయణ


కలికిరి నేస్తం న్యూస్:పరిసరాల పరిశుభ్రతతో రోగ్యం పదిలంగా ఉంటుందని ప్రిన్సిపల్ ఎస్ వి సత్యనారాయణ పేర్కొన్నారు.కలికిరి జేఎన్టీయూ కళాశాలలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం అధికారిణి డాక్టర్ కె.అపర్ణ ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని కళాశాల ఆవరణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎస్ వి సత్యనారాయణ మాట్లాడుతూ అపరిశుభ్రత కలిగిన ప్రాంతాలను పరిశుభ్రత చేయడం ద్వారా ప్రజలు ఎలాంటి అనారోగ్యానికి గురికారని  సూచించారు.విద్యార్థులందరూ పరిశుద్ధతకి ప్రధమ పీఠం వేయాలని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెషర్ ఎస్ వి సత్యనారాయణ సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుభాష్ , ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ డాక్టర కె అపర్ణ, కళాశాలలోని వివిధ విభాగ అధిపతులు, భోధన,భోధనేతర సిబ్బంది మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం