విద్య,శాస్త్ర సాంకేతిక రంగాల్లో కలాం సేవలు నిరుపమానం ప్రేరణదాయకం..పీలేరు ముస్లిం జేఏసి
కలికిరి నేస్తం న్యూస్:అబ్దుల్ కలాం జీవితం కోట్లమందికి స్ఫూర్తిదాయకమని విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కలాం సేవలు నిరుపమానం ప్రేరణదాయకంమని పీలేరు ముస్లిం జేఏసి నాయకులు పేర్కొన్నారు.భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప శాస్త్రజ్ఞుడు,మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా.ఏ.పి.జే.అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శనివారం పీలేరు ముస్లిం జేఏసి ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ సుకుమార్ చేతుల మీదుగా ముస్లిం జేఏసి సభ్యులు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముస్లిం జేఏసి నాయకులు జాకీర్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు మౌలా, రెడ్డి పీర్, సలీమ్, ఫైరోజ్, మహబూబ్ బాషా, ఖాజా,అక్రమ్ మాజీ ఉప సర్పంచ్, మహమ్మద్ పీర్, ముత్తవల్లిలు అల్లావుద్దీన్ ఖాదర్ వల్లి షా, నూరుల్లా, ఎంహెచ్ పీఎస్ నాయకులు అమీరుల్లా, ఖాదర్ వల్లి, ఫరాజ్, ఎంఆర్ పీఎస్ నాయకులు యన్. సుధాకర్, రాజేష్, సయ్యద్ భాషా,మహబూబ్ బాషా,సుబ్రహ్మణ్యం,ఖాలేషా తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment