మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన జిల్లా అధికారి డాక్టర్ శేషగిరి బాబు

కలికిరి నేస్తం న్యూస్:మధ్యాహ్న భోజనాన్ని అన్నమయ్య జిల్లా  రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమ అధికారి డాక్టర్ శేషగిరి బాబు పీలేరు పట్టణంలోని కోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శేషగిరి బాబు మాట్లాడుతూ మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని, భోజనం వడ్డించే వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులు తమ చేతులను శుభ్ర పరుస్తున్నారా లేదా,భోజనంలో వడ్డిస్తున్న ఆకుకూరలను విద్యార్థులు తింటున్నారా, ఎవరైనా విద్యార్థులు గైర్హాజరు అయ్యారా, ఒకవేళ గైర్హాజరు అయివుంటే ఎందు పాఠశాలకు రాలేదు, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే విషయాలను ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని అన్నారు. త్రాగునీరు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఎం ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తలుపుల పి.హెచ్.సి.ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.




Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం