స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టిన సిఆర్పిఎఫ్ జవాన్లు

కలికిరి నేస్తం న్యూస్:కలికిరి పట్టణంలో సిఆర్పిఎఫ్ జవాన్లు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చేపట్టారు. కలికిరి సిఆర్పిఎఫ్ సిఐఏటి స్కూల్-3 ఇంచార్జ్ కమాండెంట్ కేసీ నిర్మల్ నేతృత్వంలో జవాన్లు కలికిరి పట్టణంలోని ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ఆవరణంలోని పిచ్చి మొక్కలను తొలగించారు.అనంతరం పరిసరాల పరిశుభ్రత గురించి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఇంచార్జ్ కమాండెంట్ కేసీ నిర్మల్ మాట్లాడుతూ ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఈ నెల చివరి వరకు చేపడుతున్నట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ కమాండెంట్ కేసీ నిర్మల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమాండ్ తో పాటు డిప్యూటీ కమాండ్లు ఏ కే సింగ్, కదం సింగ్, ఇన్స్పెక్టర్ జేఎస్ నాయక్, ఎస్ఐ ఆర్వో టిఎస్సి బాబు, హెచ్సీలు సిసిఎస్ రెడ్డి, బి.ఎం. రాజు, జవాన్లు ఆర్ వి రామయ్య, మారుతి, సలామణి, చెన్నకేశవులు, ఎస్ఎం కుమార్ వేలు, మాధవన్, అరుణ్, ధర్మరాజు మరియు పలువురు జవాన్లు సిబ్బంది పాల్గొన్నారు









Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం