వెనుకబడిన విద్యార్థులను అభివృద్దిలోకి తీసుకురావడానికే తరాల్ శిక్షణ..ఎంఇఒ రంగనాధ రెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:కోవిడ్ కారణంగా అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఉపాధ్యాయులకు తరాల్ శిక్షణ ఇస్తున్నట్లు ఎంఇఒ రంగనాధ రెడ్డి తెలిపారు. సోమవారం కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ చదివేవాండ్లపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు తరాల్ పై శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ఎంఇఒ రంగనాధ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 3, 4,5వ తరగతిలో తెలుగులోను మరియు గణితంలో వెనుకబడిన విద్యార్థులను అభివృద్ధిలోకి తీసుకురావడానికి టీచింగ్ రైట్ లెవెల్ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కోర్సు డైరెక్టర్ గా ఎంఈఓ రంగనాథరెడ్డి, సిఆర్ సి హెచ్ ఎం సంపత్, ఫస్ట్ అసిస్టెంట్ గా ప్రకాష్ వ్యవహరించగా, ఆర్పీలు మరియు సిఆర్పిలు, ఉపాధ్యాయ బృందం హాజరై శిక్షణ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పిలు, బాలమురళీకృష్ణ, విశ్వనాధయ్య, భాస్కర, తదితరులు పాల్గొన్నారు



Comments
Post a Comment