ముస్లింలకు మీలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు తెలిపిన సినీ నటుడు మోహన్ బాబు, ఎమ్యెల్యే చింతల
కలికిరి నేస్తం న్యూస్:మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురష్కరించుకుని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి లు ముస్లింలకు మీలాద్-ఉన్-నబి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వాల్మీకిపురంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ దర్శనం కోసం వచ్చిన సినీ నటుడు మోహన్ బాబును వైకాపాకు చెందిన ముస్లిం నాయకులు అబ్దుల్ కలీమ్, చికెన్ మస్తాన్, సైఫుల్లా తదితరులు కలిసిన సందర్భంగా మీలాద్-ఉన్-నబి పండుగను పురస్కరించుకొని మహమ్మద్ ప్రవక్త ఆచరణలు అందరికీ అనుసరణీయమని తెలిపారు. శాంతి, సద్భావన, సర్వమత సామరస్యం కలిగి ఉన్నప్పుడే సుఖవంతమైన జీవితం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేశవరెడ్డి, ఆర్ బి కె చైర్మన్ నీళ్ల భాస్కర్, ముస్లిం నాయకులు ఖాద్రి, సమీవుల్లా, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment