బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వినోద్ కుమార్ గౌడ్ నియామకం
కలికిరి నేస్తం న్యూస్:బీసీ సంక్షేమ సంఘం పీలేరు నియోజకవర్గ అధ్యక్షులుగా వినోద్ కుమార్ నియమితులయ్యారు. పీలేరు మండలం ఎర్రగుంట్ల పల్లె పంచాయతీ కురవపల్లి కి చెందిన వినోద్ కుమార్ గౌడ్ సేవలను గుర్తించిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హైదరాబాదులోని తన నివాసంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర స్థాయి బిసీ నాయకు సమావేశంలో వినోద్ కుమార్ గౌడ్ కు పీలేరు నియోజకవర్గ బిసి సంఘం అధ్యక్ష భాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు.తన నియామకానికి సహకరించిన బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మారేష్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ లకు వినోద్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Comments
Post a Comment