గడప గడపకు తో ప్రజా సమస్యల పరిష్కారం..ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:
ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించడానికి గడప గడపకు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం వాల్మీకిపురం పట్టణంలోని కొత్తపేట, బండ మఖాన్ వీధి తదితర ప్రాంతాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు.ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు.సమష్యలను అడిగి తెలుసుకున్నారు.సంభందిత అధికారులకు పిలిపించి స్థానిక సమస్యలను అక్కడక్కడే పరిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ నవరత్నాల పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ప్రయోజనం పొంది ఉపాధిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు జెడ్పిటిసి మాజీ సభ్యులు చింతల శివానందరెడ్డి, సర్పంచ్ గంగులమ్మ, ఉప సర్పంచ్ కేశవరెడ్డి, నాయకులు భాస్కర్, శ్రీధర్ రాయల్, రవి తదితరులు పాల్గొన్నారు



Comments
Post a Comment