పశువులలో ముద్ద చర్మ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి..శాస్త్రవేత్త డాక్టర్ .కే. నవీన
కలికిరి నేస్తం న్యూస్:పశువులలో ముద్ద చర్మ వ్యాధి పట్ల పాడి రైతులు జాగ్రత్తగా ఉండాలని కేవికే పశువైద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ .కే. నవీన తెలిపారు.ఈ సంధ్భంగా డాక్టర్ నవీన మాట్లాడుతూ ముద్ద చర్మవ్యాధి పాడి పశువులకు సోకి పశువులకు తీవ్ర అనారోగ్యాన్ని కలుగజేస్తాయని అన్నారు. పాల ఉత్పత్తి మరియు ప్రత్యుత్పత్తి పై ప్రభావం చూపడం వలన పాడి రైతు ఆర్థిక పురోగతికి తీవ్ర అంతరాయం కలిగుతుందని తెలిపారు. దేశవాళీ ఆవులతో పోల్చుకుంటే సంకరజాతి ఆవులకు వ్యాధి మరియు లక్షణాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. వేసవె మరియు వర్షాకాలంలో నిరోదక శక్తి తక్కువగా ఉన్న పాడి పశువులు మరియు దూడలలో ఈ వ్యాధి ఈగలు, దోమలు, జోరీగలు, పిడుదులు వలన వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈవ్యాధి లక్షణాలలో పశువులు అధిక జ్వరంతో బాధ పడతూ శరీరం, పొదుగు పైన, కాళ్ళ గిట్టలలో, నోరు, నాలుక మొదలగు చోట్ల బొడిపెలు వచ్చి క్రమేణా అవి పగిలి వ్యాధి లక్షణాలు తీవ్రం చేస్తాయని అన్నారు. ఈ వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ముందుగా వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేసి ఉదయం మరియు సాయంత్రం పాకలో వెపాకు పొగ పెట్టాలి. ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించాలని వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే ఆ ప్రాంత వైద్యాధికారిచే చికిత్స చేయించాలని తెలిపారు. పసుపు, తులసి, అలోవెరా గుజ్జు, వేప నూనె మిశ్రమాన్ని గాయాలపై రాయాలని, వ్యాధి సోకిన పశువులకు మంచి త్రాగునీరు అందించి గాలి వెలుతురు అందే ప్రదేశంలో కట్టివేయాలని తద్వారా వ్యాధిని అరికట్టవచ్చునని కేవికే పశువైద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ కే.నవీన తెలిపారు.



Comments
Post a Comment