వైభవంగా పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక అభినందనీయం
కలికిరి నేస్తం న్యూస్:పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక వైభవంగా సాగింది. మండల కేంద్రమైన కలకడ జిల్లా పరిషత్ తెలుగు ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి అధ్యక్షతన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆనందోత్సాహాల మధ్య జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1986- 87 సంవత్సరం నందు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన 90 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాఠశాలను మర్చిపోకుండా చదువు చెప్పిన గురువులను తలచుకుంటూ మిత్రులంతా ఏకమై ఆత్మీయ సమావేశం నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు. విశ్రాంత ప్రధానోపాద్యాయులు ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యను నేర్పించిన గురువులను మరవకుండా పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక అభినందించే విషయమని కొనియాడారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి గాను పూర్వ విద్యార్థి దగ్గుపాటి వెంకటేశ్వరరావు రెండు లక్షల రూపాయలు ప్రకటించారు.ఆయనతో పాటు మిగిలిన పూర్వ విద్యార్థులందరూ కలిసి మరో 50 వేల రూపాయలను పాఠశాల అభివృద్ధికి విరాళంగా ప్రధానోపాధ్యాయులు సరస్వతీ కి అందించారు.ఈకార్యక్రమంలో విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు రాజన్న ఉపాధ్యాయులు రెడ్డప్ప రెడ్డి, రెడ్డప్ప నాయుడు,వెంకటాచారి,స్థానిక ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు శ్రీధర్ నాయుడు, పివి రమణ, దగ్గుపాటివెంకటేశ్వరరావు,సురేంద్ర,గిరివర్ధన్,రఘునాధ,ఉషారాణి,వాసంతి,వాణిశ్రీ,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment