అవార్డు గ్రహీత ప్రధానోపాధ్యాయురాలు జయమ్మకు ఘన సన్మానం
కలికిరి నేస్తం న్యూస్:అవార్డు గ్రహీత ప్రధానోపాధ్యాయురాలు జయమ్మకు సోమవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు.పీలేరు పట్టణంలోని, అయ్యప్ప రెడ్డి కాలనీ, జడ్పీ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.జయమ్మ ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్న సందర్భంగా ఎన్.జయమ్మకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ షేక్ హబీబ్ బాషా పాల్గొని ఉపాధ్యాయులతో కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా జయమ్మ స్కూల్ అసిస్టెంట్ గా, ప్రధానోపాధ్యాయునిగా విద్యా శాఖకు విశిష్టమైన సేవలు అందించారని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు ఆమె భోధన ద్వారా ఉన్నత స్థితికి కారణమయ్యారని అన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కడప జడ్పీ హాలు నందు కడప జడ్పీ చైర్మన్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి చేతులమీదుగా ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా జయమ్మ అవార్డు అందుకోవడం హర్షించదగిన విషయమని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. సన్మాన గ్రహీత జయమ్మ మాట్లాడుతూ ఉత్తమ ప్రధానోపాధ్యాయురాలుగా అవార్డు పొందడంతో పాటు అందరి ఆదరాభిమానాలతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ జి.కోమల, వైస్ చైర్మన్ ఆర్.ముని కుమారి, బోధన సిబ్బంది ఝాన్సీ లక్ష్మీబాయి, గ్లోరీ, వై.విజయ కుమారి, ఈ.మధులత, కె.సుధారాణి, జానం సుజాత, వై.శ్రీకళ, జి.సౌజన్య, ఎం.ఉమామహేశ్వరి, ఎం.స్వర్ణలత, జి.విజయ కుమారి, పి.డి సంపూర్ణమ్మ, ఏ.స్వప్నలత, ఎం.ప్రసన్నలక్ష్మి బోధినేతర సిబ్బంది ఎం.అంజమ్మ, ఎస్.రేష్మ, రమణమ్మ, యోగ ఇన్స్ట్రక్టర్ శ్రీలత, పాలమంద జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్ ఎం.మదన మోహన్ రెడ్డి,4వ వార్డు సభ్యులు పరమేష్, వైకాపా నాయకుడు పిక్కా వెంకటరమణ, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Publicvibe news link



Comments
Post a Comment