శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మంచు మోహన్ బాబు
కలికిరి నేస్తం న్యూస్:వాల్మీకిపురం పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబాను ప్రముఖ సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత,మాజీ ఎంపీ అయిన డాక్టర్ మంచు మోహన్ బాబు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన మోహన్ బాబును శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ట్రస్ట్ చైర్మన్ మరియు పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి డాక్టర్ మోహన్ బాబుకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. డాక్టర్ మంచు మోహన్ బాబు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం సందర్శించగా అర్చకులు షిర్డీ సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాధాలను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా డాక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ వాల్మీకిపురంలో షిరిడి సాయిబాబా గుడి నిర్మించిన తొలినాళ్లలో తాను సందర్శించానని అప్పుడు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తనకు అందించిన ఆతిథ్యం మరువలేనిదని అన్నారు. తాను శ్రీ శిరిడి సాయిబాబా భక్తుడునని తాను కూడా షిర్డీ సాయిబాబా గుడి నిర్మించానని అన్నారు. ఇప్పుడు తరిగొండ వెంగమాంబ మరియు లక్ష్మీ నరసింహ ఆలయాన్ని సందర్శించుటకు తరిగొండకు వెళ్తున్నట్లు తెలిపారు. సినీ నటుడు మోహన్ బాబు రాకను తెలుసుకున్న ప్రజలు భారీ ఎత్తున శ్రీ శిరిడి సాయిబాబా గుడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్ బి కే చైర్మన్ నీళ్ల భాస్కర, వైస్ సర్పంచ్ బిడ్డల కేశవరెడ్డి, మానవత చైర్మన్ జామకాయల కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు చింతల ఆనంద రెడ్డి, శ్రీధర్ రాయల్, గాంధీ పేట రఘు తదితరులు పాల్గొన్నారు.






Comments
Post a Comment