మానసిక ఆరోగ్యంతో మనమంతా క్షేమం..డాక్టర్ చంద్రశేఖర్ నాయక్

కలికిరి నేస్తం న్యూస్:మనిషి యొక్క నడవడిక ను ప్రభావితం చేస్తూ వేదన కలిగించే విధంగా ఉండే స్థితిని మానసిక సమస్యగా చెప్పవచ్చునని డాక్టర్ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు.సోమవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్బంగా  పీలేరు పట్టణంలో శ్రీమేధ జూనియర్ కళాశాల విద్యార్థులకు అందరికి మానసిక ఆరోగ్యం ప్రపంచ ప్రాధాన్యత అంశముపై అవగాహన కల్పించారు.అన్ని వయసుల వారికి అన్ని ప్రాంతాల వారికి జీవితంలో ఏదో ఒక దశలో ఏదో ఒక కారణంగా మానసికంగా బాధపడడం జరుగుతుందని తెలిపారు. రోజువారి నిర్వహించే కార్యక్రమాలే కాకుండా మనిషి సామర్థ్యంపై చెడు ప్రభావం చూపుతోందని వ్యాకూలత, నిరాశ , నిస్పృహ ఆత్మన్యూనత, కోపం,సిగ్గు నిద్రలేమి ,లక్షణాలతో  బాధపడతారని అన్నారు.ఆనంద క్షణాలకు దూరమై, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ఇలాంటి వారు వెనుకాడరని అన్నారు.ప్రస్తుతం 15 నుంచి 29 సంవత్సరాల వయసు వారిలో కుంగుబాటు అధికమని, ఇండియా మొత్తం జనాభాలో 7.5% ఈ విధమైనటువంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువని చాలామంది యువతలో ఈ డిప్రెషన్ విషయం బయటికి తెలుపకుండా ప్రమాదస్తాయికి వెళ్తున్నారని, అన్నారు. ఇది ఒక మానసిక ఆందోళనకు సంబంధించిన అంశమని అన్నారు.వైద్యులు వ్యక్తి యొక్క మానసిక స్థితిని, అంచనా వేసేందుకు వారికున్న లక్షణాలను, ఆలోచనలను ప్రవర్తన విధానాలను సమీక్షించి నిర్ధారించి చికిత్స ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు.వ్యక్తి సానుకూల ఆలోచనలు స్వంతం చేసుకుని,మంచి నిద్ర,పౌష్టికాహారం,శ్రావ్యమైన సంగీతం వింటూ,మనస్ఫూర్తిగా  నవ్వడం,పుస్తకాలను చదవడం,వ్యాయామం చేయడం,మొదలగు వ్యాపాకలతో మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు స్వంతం చేసుకోవాలని డాక్టర్ చంద్ర శేఖర్ నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ కొండయ్య , సి.హెచ్.ఓ.ఆయేషా, ప్రిన్సిపాల్  లోకేష్,లెక్చరర్ బృందం.హెల్త్ అసిస్టెంట్ శివ,వెంకటరత్నం,ఆశా కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు







Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం