సారాను వదిలి ప్రత్యామ్నాయ మార్గాలలో జీవనాన్ని కొనసాగించాలి..జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా

కలికిరి నేస్తం న్యూస్:అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలకడ మండలంలోని దిగువతాండ గ్రామంలో "పరివర్తన 2.0" కార్యక్రమం పై శుక్రవారం గ్రామ ప్రజలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా, మరియు ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరై మాట్లాడుతూ ప్రాణాంతకమైన మత్తు పానియాలైన నాటుసారా తయారీ,విక్రయాలు జరపరాదని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని తద్వారా గ్రామస్తులు జీవనం సాగించాలని తెలిపారు.ఇందుకు కావలసిన సహకారం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.దిగువతాండ గ్రామంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా 16 లక్షల రూపాయలు 17 మంది మహిళలకు రుణ పత్రాలు అందజేశారు.ఈ రుణాల ద్వారా ఆవులు,మేకలు కొనుగోలు చేసి జీవనాన్ని సాగించాలని తెలిపారు. తాండాకు సిసి రోడ్లు, శ్మశాన వాటిక, అర్హులైన వారికి ఇండ్లు,ఆర్.ఓ. ప్లాంటు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ తాండాలో సారా కేసులు తగ్గాయని, సారా తయారు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్, ఎస్పీ లు తాండ గ్రామస్తులచే సారా రహిత గ్రామంగా చేయడానికి తమ వంతు కృషి చేస్తామని వారి చే ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో డిఅర్ డిఏ పిడి సత్యనారాయణ, ఎంపిపి శ్రీదేవి, తహసిల్దార్ రాము, ఎంపిడిఓ సీహెచ్ నారాయణ,ఎంపిటిసి ఈశ్వర్ నాయుడు,సర్పంచ్ స్వరూప,ఎంఇఓ మునీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను క్రింది 👇లింక్ ఓపెన్ చేసి పబ్లిక్ వైబ్ లో చూడగలరు

publicvibe news link 












Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం