జగనన్న చేయూతతో ఒంటరి మహిళలకు భరోషా..ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:ఒంటరి మహిళలకు ఆసరాగా జగనన్న చేయూత నిలిచిందని ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తెలిపారు.పీలేరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో జరిగిన ఒంటరి మహిళలకు జగనన్న చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వం నుంచి పీలేరు మండలంలోని 3795 మంది ఒంటరి మహిళలకు వచ్చిన 7.12 కోట్ల రూపాయల చేయూత చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండిసి డైరెక్టర్ హరీష్ రెడ్డి, జెడ్పిటిసి ఏటి రత్నశేఖర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడప గిరిధర్ రెడ్డి, జెడ్పీ కో ఆప్షన్స్ సభ్యులు షఫీ, పీలేరు గ్రామపంచాయతీ సర్పంచ్ షేక్ హబీబ్ బాషా, వైస్ ఎంపీపీ ఎన్ వి చలపతి, వెలుగు కోఆర్డినేటర్ రూతు,తహసీల్దార్ రవి, ఏపీఎం లక్ష్మిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Publicvibe news link




Comments
Post a Comment