క్రిస్టియన్ మైనార్టీలకు అండగా వైఎస్ఆర్ ప్రభుత్వం..సర్పంచ్ షేక్ హబీబ్ భాషా

కలికిరి నేస్తం న్యూస్:క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధికి వైయస్సార్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పీలేరు గ్రామపంచాయతీ సర్పంచ్ షేక్ హబీబ్ భాషా పేర్కొన్నారు. పీలేరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల వేర్ హౌస్ గోడౌన్ ఆవరణంలో జరిగిన రక్షణ సువార్త మహాసభలలో ముఖ్యఅతిథిగా సర్పంచ్ షేక్ హబీబ్ భాష పాల్గొని మాట్లాడుతూ పీలేరు పట్టణంలో క్రిస్టియన్ కు స్మశాన వాటికకు ఎంపి,ఎమ్మెల్యేల సహకారంతో స్థలం ఇచ్చినట్లు తెలిపారు.అదే విధంగా కరోనా సమయంలో ప్రతి చర్చిలోనూ శానిటేషన్ చేసి వారి ప్రార్థనలకు ఇబ్బంది రాకుండా సహకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవిపల్లి మండల వైఎస్ఆర్ సిపి యువనాయకులు గజ్జల శీను రెడ్డి, బిఆర్ ఐ ఎం వ్యవస్థాపకులు మరియు ప్రసంగీకులు బ్రదర్ కేఆర్ జాన్, రాయలసీమ సేవకులు పాస్టర్ వి. విజయ్ కుమార్, పాస్టర్ వి.రాజు పాస్టర్.డావియల్,పాస్టర్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు





Comments

Popular posts from this blog

ఐక్యరాజ్య సమితి దినోత్సవం సంధర్భంగా ప్రత్యేక కథనం