చేతుల పరి శుభ్రతే -ఆరోగ్యానికి భద్రత..జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్.డాక్టర్ శేషగిరి బాబు
కలికిరి నేస్తం న్యూస్:చేతుల పరిశుభ్రతే -ఆరోగ్యానికి భద్రత అని అన్నమయ్య జిల్లా ఆర్.బి.ఎస్.కే జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శేషగిరి బాబు అన్నారు. శనివారం అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు చేతుల పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.వాయల్పాడు మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో ఆయన చేతుల పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత పై విద్యార్థులకు డాక్టర్ శేషగిరి బాబు అవగాహన కల్పించారు. అనంతరం హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ చేతుల పరిశుభ్రత లోని ఆరు దశలను చేసి చూపించారు.అనంతరం విద్యార్థులతో చేయించారు.జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శేషగిరి బాబు పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు. వంట చేయువారు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు.చేతి వేళ్ల గోర్లు ప్రతివారం కత్తిరించుకోవాలని,మల మూత్ర విసర్జన అనంతరం సబ్బు తో చేతులు శుభ్రపరచడం తప్పనిసరి అన్నారు. విద్యార్థులు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు.దీనివల్ల నులిపురుగుల నివారణ,రక్తహీనత నివారణ ,కడుపు నొప్పి వంటి అనారోగ్య సమస్యలు రావని తెలిపారు.అవగాహన కల్పించిన వారిలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రమా మంజుల, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ,ఉషారాణి,కొండయ్య, ఎమ్.పి.హెచ్.ఈ.ఓ.శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పబ్లిక్ వైబ్ న్యూస్ లింక్👇👇







Comments
Post a Comment