క్రీడాకారుడు హనీఫ్ మృతదేహానికి ఎమ్మెల్యే చింతల నివాళి
కలికిరి నేస్తం న్యూస్:వాల్మీకిపురం పట్టణం నాయక్ వీధికి చెందిన సీనియర్ క్రీడాకారుడు హనీఫ్ (68) మృతదేహానికి పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శనివారం నివాళులర్పించారు. పట్టణానికి చెందిన క్రీడాకారుడు హనీఫ్ గుండెపోటుకు గురై శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి శనివారం ఉదయం వారి ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. క్రీడాకారుడు హనీఫ్ వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్ క్రీడలలో ఎంతో ప్రావీణ్యత కలిగి ఉండేవారని , యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఎమ్మెల్యేతో పాటు ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీకళాశాల వైస్ ప్రిన్సిపల్ జే.క్రిష్ణ మూర్తి,ఆర్ బి కే చైర్మన్ నీళ్ల భాస్కర్ , మైనారిటీ నాయకులు అబ్దుల్ కలీమ్, చికెన్ మస్తాన్, సైఫుల్లా తదితరులు నివాళులు అర్పించారు.

Comments
Post a Comment