దొడ్డిపల్లి గ్రామంలో డ్రోన్ సర్వే ను ప్రారంభించిన తహసీల్ధార్ జే.రాము
కలికిరి నేస్తం న్యూస్:కలకడ మండలం దొడ్డిపల్లి గ్రామంలో డ్రోన్ సర్వేను సోమవారం తహసీల్దార్ ప్రారంభించారు.రెండవ విడత సర్వేలో భాగంగా అధికారులు కలకడ, దొడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసారు. కలకడ పంచాయతీలో 10 వేల ఎకరాల భూమి, దొడ్డి పల్లి పంచాయతీలో 1632 ఎకరాలకు సంబంధించి డ్రోన్ సర్వే నిర్వహించారు. డ్రోన్ సర్వే నిర్వహించిన ప్రాంతంలో రీ సర్వే నిర్వహించనున్నట్లు తహసీల్ధార్ జే.రాము తెలిపారు.ఈ సంధర్భంగా తహసీల్ధార్ జే.రాము మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న భూ రక్ష మరియు భూ హాక్కు పథకం కింద భూముల రీ సర్వే కొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా డ్రోన్ సర్వేను చేపట్టినట్లు తెలిపారు.ఇందులో భాగంగా సోమవారం డ్రోన్ సర్వేను కలకడ మండలంలో చేపట్టినట్లు తెలిపారు.వైఎస్సార్ జగనన్న భూ రక్ష మరియు భూ హాక్కు పథకం కింద భూముల రీ సర్వే పూర్తయితే ప్రతి రైతు భూమికి భద్రత లభిస్తుందని తెలిపారు.ప్రతి రైతు రీ సర్వేకు సహకరించాలని తహసీల్దార్ రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ పార్వతమ్మ, కార్యదర్శులు నందిని, రామ్మూర్తి, వీఆర్వోలు రాధ ,అనంతరాజు, సర్వేయర్లు శివ కుమార్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment