కలికిరి పోలీస్ స్టేషన్లో ఘనంగా దసరా వేడుకలు
కలికిరి నేస్తం న్యూస్: కలికిరి పోలీస్ స్టేషన్ నందు గురువారం ఉదయం విజయదశమిని పురష్కరించుకొని ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఎస్ఐ సి.లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నందు గల వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణమంతా పూలతో అలంకరించారు. అదే విధంగా వాహనాలకు పూలదండలతో ప్రత్యేక అలంకరణ చేసీ సోమేశ్వర స్వామి ఆలయ పూజారి చేత ఆయుధాలకు, వాహనాలకు పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు ఎన్.మధుసూదనాచారి, మహబూబ్ సాహెబ్, హెడ్ కానిస్టేబుల్స్ రాజేంద్రప్రసాద్, మనోహర్, జె.రఫీ, కొండయ్య మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు





Comments
Post a Comment