వికేంద్రీకరణ కోరుతూ వైకాపా భారీ ర్యాలీ
కలికిరి నేస్తం న్యూస్:వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని మూడు రాజధానులు కావాలని కోరుతూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు పట్టణంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మేడ మల్లికార్జున్ రెడ్డి, నవాజ్ భాష,రాష్ట్ర మైనారిటీ కమీషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ తదితర ఎమ్మెల్యేలతో పాటు అన్నమయ్య జిల్లాలోని ప్రజాప్రతినిధులు,పీలేరు నియోజకవర్గంలోని నాయకులు,కార్యకర్తలు పీలేరు పట్టణంలోని జూనియర్ కళాశాల నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీని చేపట్టారు.అనంతరం జరిగిన బహిరంగ సభ లో ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పీలేరు నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఇదిలా ఉండగా కేవిపల్లి యువనాయకులు గజ్జల శీను రెడ్డి నేతృత్వంలో నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ డైరెక్టర్ హరీష్ రెడ్డి, పీలేరు ఎంపీపీ కంభం సతీష్ కుమార్ రెడ్డి, జడ్పిటిసీ రత్నశేఖర్ రెడ్డి,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కడప గిరిధర్ రెడ్డి,పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ షేక్ హబీబ్ భాష, మండల కన్వీనర్ జగన్మోహన్ రెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షామియానా షపి, ఎంపీ పిఆర్ఒ ఉదయ్,చక్రి,ఆరు మండలాల ఎంపీపీలు శ్రీదేవి,వేంపల్లి నూర్జహాన్,ఈశ్వరమ్మ,తదితరులు,అదే విధంగా జడ్పీటీసీలు కాకర్ల పద్మజ లోకవర్ధన్,ఊటుపల్లి హారిక,గజ్జల శృతి,కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భరకం రవి కుమార్ రెడ్డి,కలకడ మండల సింగిల్ విండో అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, తదితర ప్రజా ప్రతినిధులు,వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Gajjela seenu reddy bike ryali👆




Comments
Post a Comment