పేద ప్రజల ఆరోగ్యాని కే ఫ్యామిలీ డాక్టర్ సేవలు.ఎమ్యెల్యే నవాజ్ బాషా
కలికిరి నేస్తం న్యూస్:పేద ప్రజల ఆరోగ్యానికే ఫ్యామిలీ డాక్టర్ సేవలను ప్రభుత్వం చేపట్టినట్లు ఎమ్మెల్యే నవాజ్ బాషా మరియు డిఎంహెచ్ఓ కొండయ్య అన్నారు. శనివారం మదనపల్లి పట్టణంలోని జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా 104 వాహనాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండయ్య మరియు జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ లోకవర్ధన్ లతో కలసి ఎమ్మెల్యే నవాజ్ భాష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షపాతి అని ప్రజల కోసం ప్రతి ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందేలా రెండు వేల జనాభాకు ఒక వై.ఎస్.ఆర్. విలేజీ క్లినిక్ ఏర్పాటు చేసి నెలకు రెండు పర్యాయాలు సంచరించే విధంగా వైద్యులు మరియు సిబ్బందిని గ్రామానికి 104 వాహనం లో పంపించి వైద్య సేవలు అందేలా చేస్తున్నారని తెలిపారు. డి.ఎమ్.హెచ్.ఓ.డాక్టర్ కొండయ్య మాట్లాడుతూ ప్రతి వాహనం లో 67 రకాల మందులు,14 రకాల పరీక్షలు అందుబాటులో ఉంచామని అన్నారు.డి.పి.ఎమ్.ఓ.డాక్టర్ లోకవర్ధన్ మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్ సేవలు పేద ప్రజలకు ఒక వరం అని అన్నారు.దీంతో పాటుగా స్పెషలిస్ట్ సేవలు కూడా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు, న్యూక్లియస్ వైద్యాధికారి డాక్టర్ విష్ణు,104 జిల్లా మేనేజర్ ప్రవీణ్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.



Comments
Post a Comment