మానవ మనుగడకు మొక్కలు ఎంతో ఉపయోగకరం..ఫ్రొఫెసర్ ఎంఎల్ఎస్ దేవకుమార్
కలికిరి నేస్తం న్యూస్:కలికిరి జేఎన్టీయూ కళాశాలలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు కమ్యూనిటీ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.అపర్ణ ఆధ్వర్యంలో శుక్రవారం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ త్రు ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రొఫెసర్ ఎం.ఎల్.ఎస్ దేవకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ ఎస్ దేవకుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మొక్కలు మానవ మనుగడకు అతి ముఖ్యమైనవని ఆహారం, అన్నారు.దుస్తులు, నివాసం. వీటితో పాటు ప్రాణ వాయువు, ఆక్సిజన్ కూడా ఎంతో అవసరం. ఈ అవసరాలన్నీ దాదాపు మొక్కల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తీరుతున్నాయని అన్నారు. అంతేకాకుండా ఇతరత్రా అనేక రూపాల్లో మొక్కలు మానవుని అవసరాలకు ఉపయోగపడుతు న్నాయని అన్నారు.పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళల్లో ఒక మొక్క నాటాలని తెలుపుతూ మొక్కల యొక్క వైవిధ్యాన్ని వివరించారు. అదేవిధంగా ఈ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టినందుకు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సుభాష్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేట్ డాక్టర్ కె అపర్ణ, కళాశాలకు చెందిన వివిధ విభాగాధిపతులు డాక్టర్ నాగ ప్రసాద్ నాయుడు, డాక్టర్ వెంకటేశ్వరరావు, డాక్టర్ నీరజ, డాక్టర్ సరిత, డాక్టర్ నజీరా, ఉపాధ్యాయ ఉపాధ్యాయనేతర సిబ్బంది మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు

Comments
Post a Comment