ప్రయాణిస్తూనే బస్సులో యువకుడు మృతి
కలికిరి నేస్తం న్యూస్: బస్సులో ప్రయాణిస్తూనే యువకుడు మృతి చెందిన సంఘటన పీలేరు పట్టణంలో శనివారం చోటు చేసుకుంది.మృతుడి బంధువుల కథనం మేరకు చిత్తూరు జిల్లా ఐరాల మండలం చల్లగుండ్లపల్లికి చెందిన వాసు కుమారుడు 22 సంవత్సరాల పృద్వి ఎంబీఏ ఇటీవల పూర్తి చేశాడు. ఇదిలా ఉండగా పృద్వి కర్నూలుకు తమ స్నేహితుని దగ్గరికి వెళ్లి చూసుకొని తిరిగి కర్నూల్ టు డిపో బస్సులో బయలుదేరి ఇంటికి వస్తున్న క్రమంలో పీలేరు మండలం ఒంటిల్లు టోల్గేట్ వద్దకు రాగానే పృథ్వికి ఫిట్స్ రావడంతో డ్రైవర్ హుటాహుటిన ప్రధమ చికిత్స చేసేందుకు ప్రయత్నించాడు. అయితే 108 కి ఫోన్ చేసి తెలపడంతో వారు పీలేరు బస్టాండుకు వచ్చేయాలని కోరడంతో వెంటనే పీలేరు బస్టాండ్ కు ఆర్టీసీ బస్సు చేరుకోగా పరిశీలించిన 108 సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.ఇదిలా ఉండగా రిజర్వేషన్ ఆధారంగా ఇచ్చిన ఫోన్ నంబరుకు కాల్ చేయగా పృద్వీకి డయాలసిస్ సమస్య ఉందని అనారోగ్యం కారణంగా వెళ్లొద్దని తెలిపిన వెళ్లిన కుమారుడు ఇంటికి చేరుకోకుండానే మృత్యువాత పడటంతో యువకుడి తండ్రి వాసు కన్నీటి పర్యంతమవుతున్నారు.



Comments
Post a Comment