గడప గడపకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
కలికిరి నేస్తం న్యూస్: గడపగడపకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం పీలేరు గ్రామపంచాయతీ లోని సచివాలయం ఐదు పరిధిలోని శ్రీనాధపురం కాలనీ మరియు రాజీవ్ నగర్ కాలనీ నందు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇంటింటికి వెల్లి సంక్షేమ పథకాల అమలు గూర్చి వివరించారు.సమష్యలను అడిగి తెలుసుకుని సంభందిత అధికారులను పిలిచి మాట్లాడి సమష్యలను అక్కడక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేక్ హబీబ్ బాషా, జడ్పీటిసి ఏటి రత్నశేఖర్ రెడ్డి, మండల కన్వీనర్ దండు జగన్ మోహన్ రెడ్డి , వైఎస్సార్ సీపీ నాయకులు ఆనంద, డివి రమణ అలియాస్ పెద్దోడు, విద్యార్థి నాయకుడు చక్రి, స్టాంపుల మస్తాన్ , కాలనీచిన్నా , మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, సచీవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
పబ్లిక్ వైబ్ న్యూస్ లింక్👇




Comments
Post a Comment