బదిలీ ఎస్సై రవి ప్రకాష్ రెడ్డికి ఘన సన్మానం
కలికిరి నేస్తం న్యూస్:బదిలీ ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డికి బుధవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. కలకడ సర్కిల్ సీఐ సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐ సురేష్ రెడ్డి తో పాటు కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భరకం రవికుమార్ రెడ్డి,ఎంపీపీ శ్రీదేవిరవికుమార్ మరియు సింగిల్ విండో చైర్మన్ కమలాకర్ రెడ్డిలతో పాటు పలువురు పోలీస్ సిబ్బంది అభిమానులు, ప్రజలు బదిలీ ఎస్సై రవి ప్రకాష్ రెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బదిలీ ఎస్సై రవి ప్రకాష్ రెడ్డి కలకడ ఎస్సైగా మూడు సంవత్సరాల రెండున్నర నెలలు పని చేసి శాంతిభద్రతలు కాపాడుతూ అందరి మన్ననలు పొందాడని కొనియాడారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు కూడా అందించినట్లు తెలిపారు.బదిలీ ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తనకు సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తనకు సహకరించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తన స్థానంలోకి వచ్చిన కొత్త ఎస్ఐ సి.టీ స్వామికి కూడా తనకు సహకరించిన విధంగానే సహకరించాలని సిబ్బందికి, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్సై తిప్పేస్వామి మాట్లాడుతూ ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలను హర్షిస్తూ తాను కూడా మండలంలో శాంతిభద్రతలను కాపాడుతూ అందరి మన్ననలు పొందుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో రవికుమార్, ఇనాయతుల్లా, ఈ ఆర్ రెడ్డప్ప నాయుడు, బాబు రెడ్డి, జయప్రకాష్,టీచర్ శ్రీనివాసులు రెడ్డి, పొత్తూరి శ్రీకాంత్,దండు జిలాని,పోలీస్ సిబ్బంది,మహిళా పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు






Comments
Post a Comment