గ్రామీణ విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయడానికే ఏపి ఎస్ జిఎఫ్ క్రీడలు..ఎంపిడిఓ సి.గంగయ్య
కలికిరి నేస్తం న్యూస్:గ్రామీణ విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయడానికే ఏపి ఎస్ జిఎఫ్ క్రీడలను ప్రభుత్వం చేపట్టినట్లు ఎంపీడీఓ సి.గంగయ్య మరియు ఎంఈఓ రంగనాథరెడ్డి తెలిపారు. బుధవారం కలికిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ఏపి ఎస్ జిఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఒ గంగయ్య మరియు ఎంఈఓ రంగనాథరెడ్డిలు పాల్గొని క్రీడలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల పట్ల ప్రతి విద్యార్థి ఆసక్తి కలిగి ఉండాలని, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని పెంపొందించవచ్చునని తెలిపారు.అంతేకాకుండా ఈ క్రీడల వలన గ్రామీణ విద్యార్థులలో ప్రతిభను కూడా వెలుగులోకి తీసుకురావచ్చునని తెలిపారు.ప్రతి విద్యార్థి చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని వారు ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శారద మరియు సిఆర్పి సురేష్ తదితరులు పాల్గొన్నారు




Comments
Post a Comment