తెలుగుదేశం పార్టీ అభివృధ్ధికి కార్యకర్తలే కీలకం...టీడీపీ ప్రముఖ నాయకులు రాం ప్రసాద్ రెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:కార్యకర్తలతోనే తెలుగుదేశం పార్టీ బలోపేతం సాధ్యమవుతుందని టీడీపీ ప్రముఖ నాయకులు రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు.వాల్మీకిపురం మండలం చింతపర్తికి వచ్చిన రాంప్రసాద్ రెడ్డికి కార్యకర్తలు శాలువా కప్పి పుష్ప గుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. శనివారం ఆయన చింతపర్తి గ్రామంలో టీడీపీ నాయకులతో సమావేశం అయ్యారు.ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ఆరాచక పాలన కొనసాగుతోందని జగన్మోహన్ రెడ్డి పాలనతో ప్రజలు విసిగి వేసారి పోయారని అన్నారు.అక్రమాల్ని అడ్డుకుంటే రౌడీల్లా దౌర్జన్యాలు, ప్రస్నిస్తే అక్రమ కేసులు బనాయించడం వైకాపా నాయకులకు అలవాటు గా మారిందని అన్నారు.రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అప్పుడే సంస్థల్లో, వ్యవస్థలో మార్పు వచ్చి పేదోడికి న్యాయం జరుగుతుందని అన్నారు .తెలుగుదేశం పార్టీలో కష్టపడే కార్యకర్తలకు ఎప్పుడు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శేషాద్రి రెడ్డి, మధుసూదననాయుడు, భాస్కర రెడ్డి, జి ఎల్ లక్ష్మీ నారాయణ, నరసింహులు,శివ ప్రసాద్ రెడ్డి, హరినాధ రెడ్డి,నరసింహా రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గిరి ప్రసాద్ నాయుడు, భాస్కర ,చంద్రబాబు, ఎస్ ఆర్ శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment