అసంక్రమిత వ్యాధులపై అవగాహన కలిగివుండాలి..జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శేషగిరి బాబు
కలికిరి నేస్తం న్యూస్:అసంక్రమిత వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగివుండాలని అన్నమయ్య జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ శేషగిరి బాబు తెలిపారు.అసంక్రమిత వ్యాధుల పై అవగాహన కార్యక్రమాల లో భాగంగా డాక్టర్ శేషగిరి బాబు బుధవారం కలికిరి పట్టణం లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపాల్ శివరామ కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు అసంక్రమిత వ్యాధుల పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డాక్టర్ శేషగిరి బాబు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రస్తుతం ప్రతి ఐదు మందిలో ఒకరు ఏదో ఒక అసంక్రమిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిపారు.అసంక్రమిత వ్యాధులు అంటే ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందవు.ఆ జబ్బులు షుగర్,బి.పి,కాన్సర్,థైరాయిడ్,పక్షవాతం, గుండె సంబంధ జబ్బులు,దంత మరియు కంటి సమస్యలు, స్థూలకాయం వంటివి.ప్రపంచంలో కెల్లా మన దేశంలోనే షుగర్ వ్యాధి గ్రస్థులు ఎక్కువ మంది ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం కూడా వీటికి ఒక కారణం. షుగర్ వల్ల రాను రాను శరీరంలోని అవయవాలు కిడ్నీలు, గుండె,కాలేయం, దంతాలు, కళ్ళు,నాడీ వ్యవస్థ మొదలైనవి క్రమ క్రమంగా దెబ్బతింటాయని తెలిపారు.హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఈ అసంక్రమిత జబ్బులన్నిటికి ముఖ్య కారణాలు గురించి వివరించారు.అవి వంశపారంపర్యంగా వచ్చు జబ్బులు,వ్యాయామం లేకపోవడం, ప్రతిరోజు యాంత్రికజీవనం గడుపుట,సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుట మరియు వినియోగించుట,ఆకుకూరలు, కాయగూరలు తక్కువ తినటం,జంక్ ఫుడ్స్ వినియోగం ఎక్కువగా ఉండుట,తీవ్ర ఒత్తిడి, ఆలోచనలు,సంపాదన మీద అత్యాశ,వాహనాలు, సెల్ఫోన్ల వినియోగం పెరుగుట,నీటికొరత వల్ల,కరువు వల్ల వ్యవసాయ పనులు లేక పట్టణాలకు. వలస వెళ్లడం,మద్యపానం, ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం వలన నేడు ప్రపంచ దేశాల్లో కెల్లా మన దేశంలోనే ఈ అసంక్రమిత వ్యాధుల సమస్య ఎక్కువగా ఉందని అన్నారు.నివారణా మార్గాలు ప్రతి రోజు క్రమం తప్పని వ్యాయామం, ప్రతీ రోజు యోగా చేయడం, వీలయినంత వరకు ఒత్తిడి, ఆలోచనలు తగ్గించుకోవడం, మాంసాహారం తక్కువగా తినడం, శాకాహారం భుజించుట, అన్నివిధాలా మేలు.వాహనాలు, సెల్ఫోన్ల వాడకం తగ్గించడం ఉత్తమం,వరి బియ్యం రోజుకు ఒక్కసారి మాత్రమే తినేలా ప్రణాళిక చేసుకోవాలి.ప్రతి ఆరు నెలలకు ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకోవాలి.ముప్పై సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ,మెన్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. జామ, దానిమ్మ,అరటి, ద్రాక్ష, కీరదోస,అల్ల నేరెడు పళ్ళు, ఆపిల్,బేరి,వంటివి విరివిగా తినాలి.మొలకెత్తిన చిరు ధాన్యాలు మరియు రాగి,జొన్న, సద్ద సంగటి వారానికోసారి తప్పక తినాలి.ప్రతీ రోజు 4 లీటర్ల కు తగ్గకుండా నీరు త్రాగాలి దీనివల్ల కిడ్నీ సమస్యలు రావు.కొవ్వు అధికంగా ఉన్న నూనెలు,ఆహార పదార్థాలను వీలయినంత తక్కువగా తినాలి.మద్య పానం,ధూమపానం, పొగాకువాడకపోవడం చాలా మంచిదని సూచించారు.ఈకార్యక్రమంలో మెడికుర్తి పి.హెచ్.సి.హెల్త్ అసిస్టెంట్ వలిసాబ్ ,పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.




Comments
Post a Comment