గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలను అందించడానికే గడపగడపకు ..ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
కలికిరి నేస్తం న్యూస్:గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలను అందించడానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.బుధవారం కలకడ మండలం కోన గ్రామ పంచాయతీ నందు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం మూడవ రోజు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు.అదేవిధంగా సమస్యలు అడిగి తెలుసుకుని అక్కడికక్కడే సంభందిత అధికారులను పిలిచి మాట్లాడి పరిష్కరించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందివ్వాలని కోరారు.సమష్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భరకం రవికుమార్ రెడ్డి,ఎంపీపీ శ్రీదేవి, మండల కన్వీనర్ కమళాకర్ రెడ్డి, సర్పంచ్ జెల్లా రాజగోపాల్ రెడ్డి, నాయకులు రవికుమార్,ఎంపిడిఓ సీహెచ్ నారాయణ,సచివాలయ సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
Publicvibe news link




Comments
Post a Comment